హరిహర వీరమల్లు సినిమా ఎన్నో ఇబ్బందులు దాటుకొని గత నెలలో విడుదలైంది. డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి సంబంధించి అన్ని విషయాలలో ఓపెన్ గానే చెప్పేస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ ప్రమేయం గురించి మాట్లాడారు. వాస్తవానికి హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిన తర్వాత మళ్లీ సినిమా మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నదని.. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడం చేత తనకు త్రివిక్రమ్ తో టచ్  ఏర్పడ్డానని తెలిపారు.



తాను అనుకున్న ఒక లైన్ తీసుకొని త్రివిక్రమ్ గారికి చెప్పగా అది ఆయనకు బాగా నచ్చిందని వెంటనే పవన్ కళ్యాణ్ కి జ్యోతి కృష్ణ ను రెడీగా ఉండమని చెప్పారట. ఈ సినిమా చేయవచ్చని చెప్పినట్లుగా తెలిపారని తెలిపారు జ్యోతి కృష్ణ. పవన్ కళ్యాణ్ కి చాలా అత్యంత సన్నిహితులలో ఒకరైన త్రివిక్రమ్ చెప్పడం వల్లే షూటింగ్ హాజరయ్యారని తెలియజేశారు. అలాగే థాంక్స్ కార్డులో హైపర్ ఆదికి థాంక్స్ వేయడం గురించి మాట్లాడడం జరిగింది జ్యోతికృష్ణ.



ఈ చిత్రంలో హైపర్ ఆది ని కూడా ఉపయోగించుకున్నామని తెలిపారు. తాను రూల్స్ రంజన్  సినిమా చేస్తున్నప్పుడు హైపర్ ఆదితో తనకి బాగా పరిచయం ఏర్పడిందని ఈ చిత్రంలో నక్క పవన్ కళ్యాణ్ మాట్లాడే సన్నివేశం హైపర్ ఆది రాసిందేనని తెలియజేశారు.. అయితే అక్కడ కాస్త కామెడీ ఉంటే బాగుంటుందనుకున్నాము ఈ నేపథ్యంలోనే ఆ సీన్ రాసుకున్నామంటూ తెలియజేశారు. ఆ సీన్ కి హైపర్ ఆది డైలాగులు అందించారని.. ఆ డైలాగులకు కాస్త తెలంగాణ యాష కూడా ఉపయోగించవల్సి వచ్చిందని తెలిపారు. ఈ చిత్రంలో చాలామంది కాంట్రిబ్యూషన్ ఉందని తెలియజేశారు జ్యోతి కృష్ణ. ఇక ఇప్పటివరకు అఫీషియల్ గా హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్స్ విషయంపై చిత్ర బృందం మాత్రం చెప్పలేదు. మరి సీక్వెల్ విషయం పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: