సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా కూలీ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో కనిపించనుండగా ...   ఆమీర్ ఖాన్ ఈ మూవీ లో ఓ చిన్న క్యామియో పాత్రలో కనిపించబోతున్నాడు. శృతి హాసన్ , ఉపేంద్ర , సత్యరాజ్మూవీ లో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం రజనీ కాంత్ , నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే జైలర్ మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో జైలర్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

జైలర్ 2 మూవీ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి బాలకృష్ణ ఓ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే కూలీ మూవీ ని పూర్తి చేసి జైలర్ 2 సినిమాలో నటిస్తున్న రజనీ కాంత్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే రజిని తన నెక్స్ట్ మూవీ ని శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. శివ , రజనీ కాంత్ కాంబినేషన్లో కొంత కాలం క్రితం పెద్దన్న అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో నయన తార హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే శివ ఆఖరుగా సూర్య హీరోగా కంగువా అనే సినిమాను రూపొందించాడు.

మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ ను అందుకుంది. ఇక ఇప్పటికే రజినీ కి ఒక ఫ్లాప్ ని ఇచ్చి ఆఖరుగా శివ దర్శకత్వం వహించిన కంగువా సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో  శివ దర్శకత్వంలో ప్రస్తుతం రజనీ సినిమా చేయడం అవసరమా అది చాలా రిస్క్ అవుతుంది అనే అభిప్రాయాలను కొంత మంది జనాలు వ్యక్త పరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: