టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న నటులలో తేజ ఒకరు. ఈయన తేజ దర్శకత్వంలో రూపొందిన జయం అనే మూవీ తో నటుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈయనకు మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయం దక్కింది. దానితో హీరో గా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈయనకు జయం సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఈయన కెరియర్ మంచి స్థాయిలోనే ముందుకు సాగింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం నితిన్ నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ వస్తున్నాయి. కొంత కాలం క్రితం ఈయన తమ్ముడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది.

ఈయన నటించిన చాలా సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ రావడంతో ఈయన మార్కెట్ తగ్గుతుంది అని , ఈయనతో భారీ బడ్జెట్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకు రారు అనే అభిప్రాయాలను కొంత మంది జనాలు వ్యక్తం చేశారు. కానీ నితిన్ కోసం మాత్రం భారీ బడ్జెట్ పెట్టడానికి అనేక మంది నిర్మాతలు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... నితిన్ , విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కోసం నిర్మాతలు అత్యధిక భారీ బడ్జెట్ ని కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా నితిన్ కు వరుస పెట్టి భారీ అపజయాలు దక్కుతున్న కూడా నిర్మాత భారీ మొత్తంలో డబ్బులు పెట్టడానికి ముందుకు రావడంతో నితిన్ లక్ సూపర్ గా ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా నితిన్ పై భారీ బడ్జెట్ కేటాయించడం మామూలు విషయం కాదు అనే అభిప్రాయాలను కొంత మంది జనాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో నితిన్ , విక్రమ్ కే కుమార్ కాంబినేషన్లో ఇష్క్ అనే మూవీ వచ్చింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దానితో మరోసారి నితిన్ , విక్రమ్ కాంబోలో సినిమా రాబోతుంది అంటే దానిపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: