మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా సోసియో ఫాంటసీ మూవీ గా రూపొందుతుంది. త్రిష ఈ సినిమాలో చిరు కు జోడిగా నటిస్తూ ఉండగా ... మల్లాడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కి బీమ్స్ సిసిరిలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ మూవీ దర్శకుడు అయినటువంటి మల్లాడి వశిష్ట ఓ ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటివరకు మేకర్స్ టైటిల్ను ఫిక్స్ చేయలేదు. ఇకపోతే ఆగస్టు 22 వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు అనే విషయం మన అందరికీ తెలిసిందే. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరు , అనిల్ కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన టైటిల్ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కి ఓ టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు , దానినే కన్ఫామ్ చేసి చిరంజీవి పుట్టిన రోజు నాడు అధికారికంగా మేకర్స్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం  చిరు , అనిల్ కాంబోలో రూపొందుతున్న సినిమాకు మన వర ప్రసాద్ గారు అనే టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు , దీనినే చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22 వ తేదీన అధికారికంగా ప్రకటించబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండగకి  కచ్చితంగా విడుదల చేసే విధంగా ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ను మూవీ బృందం కంప్లీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: