ఏదైనా భారీ కాంబో సెట్ చేయాలి అంటే డైరెక్టర్స్ భయపడిపోతూ ఉంటారు.  దానికి మెయిన్ రీజన్ ఫ్యాన్స్. ఇద్దరు బడా హీరోలను ఒక్కే తెరపై చూపించాలి అన్న .. ఒకే మూవీలో చూపించాలి అన్న చాలా చాలా టఫెస్ట్ జాబ్ . ఒక హీరో ఫ్యాన్స్ హ్యాపీ  అయితే మరొక హీరో ఫ్యాన్స్ ఒప్పుకోరు . హర్ట్ అవుతారు. అలాంటి పరిస్థితులు మనం ఎన్నో ఇండస్ట్రీలో చూశాం. మరీ ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రాంచరణ్ పాత్ర హైలెట్ చేశారు అని జూనియర్ ఎన్టీఆర్ పాత్ర తొక్కేసారని ఎంత రాద్దాంతం చేశారో ఫ్యాన్స్ అందరికీ తెలిసిందే .


అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. బిగ్ మల్టీస్టారర్ మూవీ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు మూవీ మేకర్స్ అంటూ న్యూస్ బాగా వైరల్ గా మారింది.  పాన్  ఇండియా స్టార్స్ అయిన షారుక్ ఖాన్ అదేవిధంగా అల్లు అర్జున్ కాంబోలో ఒక బిగ్ బడా మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేశారట మేకర్స్.  ఇది ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ గా సినీ చరిత్రను తిరగరాసే మూవీగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి అల్లు అర్జున్ - షారుక్ ఖాన్ ఇద్దరు కూడా ఓకే చేశారట .



ఈ సినిమాని డైరెక్ట్ చేయబోయేది మరెవరో కాదు "సందీప్ రెడ్డి వంగ" అంటూ తెలుస్తుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ వార్త బాగా వైరల్ గా మారింది . అసలు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు ఊహించని రేంజ్ లో ఈ మూవీని సెట్ చేసి తెరకెక్కించాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారట సందీప్ రెడ్డి వంగ.  సక్సెస్ అయితే మాత్రం నిజంగా కెవ్వు కేకే . అటు బన్నీ ఫ్యాన్స్ ఇటు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్..ఇద్దరికీ హ్యాపీనే.  మరీ ముఖ్యంగా టాలీవుడ్ కి బాలీవుడ్ కి అసలు పడడం లేదు ఈ మధ్య కాలంలో అనేది అందరికి తెలుసు. వీళ్ళిద్దరి కాంబో లో సినిమా వస్తే మాత్రం మళ్లీ ఈ రెండు ఇండస్ట్రీలో  ఒకటి అవుతాయి అని చెప్పుకోవడంలో సందేహమే లేదు అంటున్నారు సినీ ప్రముఖులు . చూడాలి మరి ఏం జరుగుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: