మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శ్రీ లీల ఈ సినిమాలో రవితేజ కు జోడిగా నటిస్తూ ఉండగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఓ వైపు మాస్ జాతర సినిమా షూటింగ్లో పాల్గొంటూనే రవితేజ మరో వైపు కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో మూవీ ని కూడా స్టార్ట్ చేశాడు. ఇక రవితేజ , కిషోర్ తిరుమల కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉంది.

అందుకు తగినట్లుగానే ఈ సినిమా యొక్క షూటింగ్ను అత్యంత వేగంగా ఈ మూవీ బృందం వారు పూర్తి చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క షూటింగ్ ఈ సంవత్సరం డిసెంబర్ వరకు మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. రవితేజ ఇప్పటికే కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా తర్వాత మూవీ ని కూడా కన్ఫామ్ చేసేసుకున్నాడు. రవితేజ , కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న సినిమా తర్వాత మ్యాడ్ , మ్యాడ్ స్క్వేర్  మూవీలకు దర్శకత్వం వహించి మంచి విజయాలను అందుకొని దర్శకుడిగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు.

ఇక రవితేజ , కళ్యాణ్ శంకర్ కాంబోలో తెరకేక్కబోయే మూవీ యొక్క  రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరం డిసెంబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే రవితేజ ఆఖరుగా ధమాకా అనే సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈయన నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. మరి రవితేజ మరికొన్ని రోజుల్లో మాస్ జాతర మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మరి ఈ మూవీ ద్వారా రవితేజ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt