పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహ. చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి హిట్ టాక్ తో భారీగా దోచుకుపోతోంది .ఇప్పటివరకు సుమారుగా రూ .100 కోట్లకు పైగా కలెక్షన్స్ కూడా రాబట్టినట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే ఈ సినిమాకి సంబంధించి ఓటిటి రిలీజ్ డేట్ పైన పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన తాజాగా చిత్ర బృందం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలోనే ఈ సినిమా ఓటీటి లోకి రాబోతోంది అంటూ ప్రచారం జరుగుతూ ఉండడంతో ఈ విషయం పైన క్లిమ్ ప్రొడక్షన్స్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పలు విషయాలను పంచుకున్నది. మహావతార్ నరసింహ త్వరలో ఓటీటి లోకి రాబోతోందని ప్రచారం తమ దృష్టికి వచ్చిందని వీటిపైన స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాము ప్రపంచవ్యాప్తంగా చాలా థియేటర్లలో ఈ సినిమా నడుస్తోంది. ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ ను తాము ఖరారు చేయలేదని తెలియజేశారు.


మహావతార నరసింహ ఏ ఓటీటి సంస్థతో తాము డీల్ చేసుకోలేదని ఎలాంటి విషయాలనైనా సరే మా అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వచ్చే అప్డేట్లను మాత్రమే మీరు నమ్మండి అంటూ తెలియజేసింది. జులై 25 న ఈ సినిమా విడుదలై భారీ కలెక్షన్స్ తో దోచుకుపోతోంది. బడా హీరోల చిత్రాలు కూడా విడుదలైన మహావతార్ నరసింహ సినిమాకి కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు ఇంకా థియేటర్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. చాలామంది ఈ సినిమాని చూసి సెలబ్రెటీలు కూడా ప్రశంసలు కురిపించారు. తెలుగులో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ విడుదల చేయగా భారీగానే లాభాలను అందుకున్నట్లు వినిపిస్తున్నాయి. మరి ఓటిటి లో ఎప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: