సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎక్కువగా వ్యాపారవేత్తలను, క్రికెటర్స్ ను,తమ చిన్ననాటి స్నేహితులను హీరోలను వివాహం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. చాలా తక్కువ మంది మాత్రమే రాజకీయ నాయకులను పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక టాలీవుడ్ హీరోయిన్ మాత్రం ఒక పొలిటిషన్ ని పెళ్లి చేసుకుంది.. సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయనే కుమారస్వామి.. కన్నడ రాజకీయాలలో ఈయన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈయన భార్య టాలీవుడ్ హీరోయిన్ అని చాలామందికి తెలియకపోవచ్చు.


అందం, అభినయం ఉండి ఎంతో పేరు సంపాదించుకున్న హీరోయిన్ రాధిక నే కుమారస్వామి భార్య.. కన్నడ సినీ పరిశ్రమలో కూడా ఈమె హీరోయిన్గా బాగానే పేరు సంపాదించింది. 2002 సంవత్సరంలో నినగగి చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.. రాధిక చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి భారీగా క్రేజీ సంపాదించింది.. కేవలం 9వ తరగతి చదువుతున్న సమయంలో కన్నడ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాలలో నటించింది. అలా అతి చిన్న వయసులోనే పలు చిత్రాలలో నటించి భారీగానే పేరు సంపాదించింది.

తెలుగులో తారకరత్న నటించిన భద్రాద్రి రాముడు చిత్రంలో నటించింది.. ఆ తర్వాత అవతారం అనే చిత్రంలో కూడా నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. చివరికి 2008 వరకు సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమైన ఇమే 3 చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. అయితే అనంతరం కుమారస్వామిని వివాహం చేసుకోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ముఖ్యంగా కుమారస్వామికి, రాధికకు కూడా రెండవ వివాహం కావడం గమన్హారం. వీరికి షేమిక అనే కూతురు జన్మించిన తర్వాత 2015లో విడిపోయారు. అయితే తిరిగి మళ్లీ స్వీటీ నా జోడి, అవతారం, రుద్రతాండవం, దమయంతి తదితర చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆజగ్రత వంటి కన్నడ సినిమాలో నటిస్తోంది రాధిక.

మరింత సమాచారం తెలుసుకోండి: