బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించిన హీరోయిన్ అనుష్క గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత కొంతమేరకు సైలెంట్ అయినా చాలాకాలం తర్వాత మళ్లీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు మరొకసారి ఘాటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తోంది. డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


ట్రైలర్లో అనుష్క అభిమానులు ఊహించిన దాని కంటే ఎక్కువగా వైలెన్స్ కనిపిస్తోంది.. ఇందులో అనుష్క, విక్రమ్ ప్రభు గ్యాంగ్ తో  పాటు ఘాటీలో నివసించే ప్రజలు గంజాయిని అమ్ముతూ ఉంటారు.. అలాంటి వీరి నివసిస్తున్న ప్రాంతంలో బ్లాక్ గోల్డ్ మైనింగ్ ఉండడంతో  కొంతమంది రాజకీయ నాయకుల కన్ను పడుతుంది. ఘాటిలో నివసిస్తున్న వారందరిని ఎలాగైనా తరిమేయాలని ప్లాన్ చేసి తరిమేస్తారు.. ఆ తర్వాత ఘాటిలు ఏం చేస్తారన్నదే సినిమా స్టోరీ అన్నట్టుగా కనిపిస్తోంది.


ఆ రాజకీయ నాయకులను ఘాటిలు ఎలా ఎదుర్కొన్నారు అన్నది చాలా ఆసక్తికరంగా డైరెక్టర్ క్రిష్ చూపించారు. హీరోయిన్ అనుష్క నటన మరొకసారి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా కనిపిస్తోంది. విక్రమ్ ప్రభువు , అనుష్క మధ్య వచ్చే కెమిస్ట్రీ కూడా హైలెట్ గా ఉన్నది. అలాగే ఇందులో పోలీసు అధికారిగా జగపతిబాబు నటిస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , గ్లింప్స్ హైలెట్ అవ్వగా ఇప్పుడు ట్రైలర్ తో మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది. యువి మూవీ క్రియేషన్ బ్యానర్ పై భారీ బడ్జెట్లోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైలర్ అయితే అద్భుతంగా ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: