నాచురల్ స్టార్ నాని సినిమా విషయంలో చాలా క్లారిటీగా ఉంటూ వస్తాడు. ఆయన సినిమా విడుదల తేదీ అనౌన్స్ అయ్యింది అంటే దాదాపుగా అదే తేదీకి సినిమా విడుదల అవుతూ ఉంటుంది. ఆయన ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక దానికి చాలా సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు. అలాగే ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో మరో సినిమా షూటింగ్లో పాల్గొన్న దానికి కూడా పక్కాగా డేట్స్ ఇస్తూ ఉంటాడు. దానితో ఆయన ఒకే సారి రెండు , మూడు సినిమాలను కూడా పక్కా ప్లానింగ్ తో పూర్తి చేసి చెప్పిన తేదీకి విడుదల చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఇకపోతే నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన గ్లీమ్స్ వీడియోను చాలా కాలం క్రితమే విడుదల చేశారు. ఈ మూవీ గ్లీమ్స్ వీడియోతో పాటు ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ గ్లీమ్స్ వీడియో ను విడుదల చేసిన చాలా కాలానికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ మూవీ షూటింగ్ కూడా మేకర్స్ ముందుగా అనుకున్న సమయానికి ప్రారంభం కాలేదు అని , అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా అంత స్పీడ్ గా జరగడం లేదు అని , దానితో ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల కావడం కష్టం అని ఓ వార్త వైరల్ అయింది.

దానితో ది ప్యారడైజ్ మూవీ విషయంలో నాని లెక్క తప్పింది అని , ఆయన సినిమా విడుదల పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది భావించారు. కానీ ది ప్యారడైజ్ మూవీ విడుదల పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ శాతం ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్మోస్ట్ ఈ సినిమా మర్చి 26 వ తేదీన విడుదల కావడం పక్క అనే సమాచారం అందుతుంది. మరి నాని హీరో గా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ సినిమా చెప్పిన తేదీకి విడుదల అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: