సుకుమార్ ..ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ . ఎంతోమంది పాన్ ఇండియా డైరెక్టర్స్ ఉన్న సుకుమార్ అంటే మాత్రం స్పెషల్ అరుపులు వినపడతాయి . దానికి దీ వన్  అండ్ ఓన్లీ రీజన్ ఆయన సినిమాల విషయంలో తీసుకునే కొన్ని కొన్ని డెసిషన్స్.  పక్క వాళ్ళు ఏమనుకుంటారు ..తన సినిమా హిట్ అవుతుందా ..? ఫ్లాప్ అవుతుందా..? అనే విషయాలను పక్కన పెట్టేసి తాను రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారము ముందుకు వెళుతూ ఉంటారు.  ఆయన రాసుకున్న స్క్రిప్ట్ కి ఏ హీరో సూట్ అవుతాడు ఏ హీరోయిన్ సూట్ అవుతుంది. మిగతా నటీనటుల విషయంలో కూడా చాలా పక్కాగా ముందుకు వెళుతూ ఉంటారు.


సోషల్ మీడియాలో ఇప్పుడు సుకుమార్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా విషయం కావడంతో మెగా ఫాన్స్ కూడా ఈ విషయంపై ఎక్కువగా చర్చించుకుంటున్నారు.  మనకు తెలిసిందే పుష్ప2 తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుని చరణ్ తో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు . ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి అయిపోయింది . "పెద్ది" సినిమా షూట్ కంప్లీట్ అవ్వగానే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు సుకుమార్ . అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక - సాయి పల్లవి - మమిత బైజు.. ఇలా రకరకాల పేర్లు వినిపించాయి . లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ..ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానీని చూస్ చేసుకున్నారు అంటూ తెలుస్తుంది .



ఇది నిజంగా బిగ్ టఫ్ డెసిషన్ . రీసెంట్ గానే కియరా అద్వానీకి డెలివరీ అయ్యింది. ఆమె హార్మోన్స్ చేంజెస్ వల్ల రూపురేఖలు బాగా మారిపోతాయి . అయితే ఆరు నెలల టైం గ్యాప్ లో సుకుమార్ కియరా అద్వానీ అంత చక్కగా తెరపై చూపించగలరా..? అనేది అందరి అనుమానం. బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న  న్యూస్ ప్రకారం కీయరా అద్వానీ ఆరు నెలల తర్వాత తన సినిమాలను మళ్ళీ సెట్స్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతుంది అంటూ తెలుస్తుంది . కాగా  ఇప్పుడు రామ్ చరణ్ తో  తెరకెక్కించే సినిమాలో కూడా ఆమెని  హీరోయిన్గా చూస్ చేసుకున్నారట.



ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయిపోతున్నారు.  ఆల్రెడీ వీళ్లిద్దరి  కాంబోలో సినిమాలు వచ్చి ఫ్లాప్ అయ్యాయి. "వినయ విధేయ రామ" అదే విధంగా "గేమ్  చేంజర్"  రెండూ కూడా అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. మళ్లీ ఎందుకు ఆ బ్యూటీని చూస్ చేసుకోవడం అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా చంటి బిడ్డని ఇంట్లో పెట్టుకొని కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయడం అంటే వెరీ వెరీ టాప్ జాబ్ , ఒకవేళ ఈ సినిమా ఆలస్యం అయితే సుకుమార్ టైంతో పాటు రామ్ చరణ్ టైం కూడా వేస్ట్ నే.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సుకుమార్ డెసిషన్ మార్చుకుంటే బెటర్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. చూద్దాం మరి ఏం జరుగుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: