కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది . ఈ వార్త తెలుసుకున్న కన్నడ ఫాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించిన కాంతార చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. అంత ఈజీగా ఈ చిత్రాన్ని మర్చిపోలేము. రిషిబ్ శెట్టి తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేసి యాక్ట్  చేయగా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలకు 100% న్యాయం చేశారు. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు . కాగా ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులకు ప్రత్యేక గుర్తింపు లభించింది .


మరీ ముఖ్యంగా టీ ప్రభాకర్ కి అయితే కూసింత ఎక్కువ స్థాయిలోనే గుర్తింపు లభించింది. రిషిబ్ తర్వాత ఈ సినిమా ద్వారా అంత బాగా మంచి మార్కులు వేయించుకున్న వ్యక్తి టీ ప్రభాకర్ మాత్రమే అని చెప్పుకోవడంలో సందేహం లేదు. కాంతార చిత్రంలో మహాదేవ పాత్రలో నటించి మెప్పించిన టి ప్రభాకర్ కొద్దిసేపటి క్రితమే గుండెపోటుతో మరణించారు . ఈ విషయాన్ని కన్నడ చిత్ర పరిశ్రమ అఫీషియల్ గా ప్రకటించింది . కర్ణాటకలోని ఉడిపి జిల్లా పరిధిలోని హిరాయడెక్ లోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలుస్తుంది.

 

రిషిబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార సినిమాలో మహాదేవ పాత్ర ని టీ ప్రభాకర్ పోషించి వందకు వందశాతం మార్కులు దక్కించుకున్నాడు . కాగా ఐదేళ్ల క్రితం టి ప్రభాకర్ కి సంబంధించిన శాస్త్ర చికిత్సలు జరిగాయి . ఆ తర్వాత క్రమం తప్పకుండా మందులు వాడుతూ వచ్చారు. తాజాగా ఆయనకు మళ్ళీ గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు.  ప్రభాకఎ కి భార్య కుమారుడు కూడా ఉన్నారు. మొదటగా నాటకాలు వేసి అందరిని అలరించిన ఆయన.. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ సినిమాలోకి రంగ ప్రవేశం చేశారు.  సినిమాలో కూడా తనదైన స్టైల్ లో నటించి ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న టీ ప్రభాకర్ ఇక మన మధ్య లేరు అన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  దీని పట్ల కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: