పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకొని చాలా సంవత్సరాలు అవుతోంది. పవన్ కళ్యాణ్ నటించిన కొన్ని సినిమాలు ఈ మధ్య కాలంలో మంచి విజయాలను అందుకున్న భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని సరికొత్త రికార్డులను సృష్టించిన సినిమాలు వచ్చి మాత్రం కాస్త ఎక్కువగా కాలమే అవుతుంది. ఇక పవన్ అభిమానులు ఆయన నుండి అలాంటి సినిమాలను ఆశిస్తున్నారు. అలాంటి తరుణం లోనే పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందడం , పవన్ చాలా కాలం తర్వాత రీమిక్ మూవీ లో కాకుండా సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం , అలాగే పవన్ నటించిన సినిమా చాలా కాలం తర్వాత విడుదల కాపడంతో ఆయన అభిమానులు ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుంది అని , ఈ మూవీ కలెక్షన్ల విషయంలో అనేక కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తుంది అని భావించారు. అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా జూలై 24 వ తేదీన విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు మొదటి రోజు మంచి ఓపెనింగ్లు లభించిన ఆ తర్వాత మాత్రం ఈ సినిమా కలెక్షన్లు భారీగా తగ్గాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 15 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది.

ఈ 15 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 69 కోట్ల షేర్ ... 113.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా దాదాపు 127.5 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 58.5 కోట్ల షేర్ కలక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబడితే క్లీన్ హీట్ గా నిలుస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ సినిమా క్లీన్ హెట్ అయ్యే అవకాశాలు చాలా వరకు కనబడడం లేదు. ఇలా ఈ మూవీ భారీ అపజయాన్ని అందుకునే అవకాశాలు ఉండడంతో పవన్ అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే మామూలు ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఈ స్థాయి అపజయాన్ని అందుకుంటుంది అని ఊహించి ఉండరు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: