ఏ స్టార్ హీరో పుట్టిన రోజైనా సరే సోషల్ మీడియా వ్యాప్తంగా ఆయన పేరుని ఆయన నటించే సినిమాలకు సంబంధించిన డీటెయిల్స్ వైరల్ చేస్తూ ఉంటారు అభిమానులు.  ప్రజెంట్ ఇప్పుడు అదేపనిలో బిజీగా మారిపోయారు ఘట్టమనేని ఫ్యాన్స్ . మహేష్ బాబు బర్త్డ డే నేడు. ఆయన బర్త్డ డేను  ఆయనకంటే ఎక్కువగా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు . మొదటి నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా కూల్ గా ఏ ఫంక్షన్ అయినా సెలబ్రేట్ చేసుకుంటారు . మహేష్ బాబు పుట్టినరోజు అయినా.. మహేష్ బాబుకు సంబంధించిన సినిమాల టీజర్ , ట్రైలర్ రిలీజ్ విషయంలో చాలా పక్కా ప్లానింగ్ తో కూల్ గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు.


ఈసారి కూడా మహేష్ బాబు బర్త డే ని  చాలా సింపుల్ గా తన కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు . అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఎక్కడ తగ్గేదేలే అన్న రేంజ్ లో భారీ భారీ కటౌట్ లతో పెద్ద కేకులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు . మరికొందరు మహేష్ బాబు పేరు చెప్పి అన్నదానం చేస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన పర్సనల్ విషయాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మహేష్ బాబు ఎంతోమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . ఆల్మోస్ట్ అందరితోను హిట్ కాంబో అంటూ ట్యాగ్ చేయించుకున్నారు .



అయితే మహేష్ బాబు పక్కన ఒక హీరోయిన్ మాత్రం చాలా చాలా ఎక్కువ మార్కులు దక్కించుకుంది.  ఎంతలా అంటే తన సొంత భార్య నమ్రత కన్నా కూడా మహేష్ బాబు పక్కన ఆ హీరోయిన్ బాగుంటుంది అన్న కామెంట్స్ వినిపించాయి . చాలా సందర్భాలలో ఆ హీరోయిన్ గురించి పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. పలువురు యాంకర్స్ పలు ఈవెంట్స్ లో అని చెప్పుకోక తప్పదు . ఆమె మరవరో కాదు "త్రిష".  మహేష్ బాబు - త్రిష కాంబోల గురించి ప్రత్యేకంగా చెప్పాలా..?? బావ మరదలుగా "అతడు" సినిమాలో వాళ్ళు నటించిన పర్ఫామెన్స్ ఎప్పటికీ మర్చిపోలేము . ఈ సినిమా తర్వాత చాలామంది బావ మరదల్లు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు అనే విషయం కూడా అందరికీ తెలుసు.  ఒకానొక సందర్భంలో కూడా మహేష్ బాబు పక్కన త్రిషనే దీ పర్ఫెక్ట్ మ్యాచ్ అన్న కామెంట్స్ కూడా వినిపించాయి . అయితే ఇలాంటివన్నీ నవ్వుతూ సరదాగా తీసేసుకుంటాడు మహేష్ బాబు . మహేష్ బాబు - నమ్రతను  ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళు ఇప్పుడు చాలా అన్యోన్యంగా ప్రశాంతంగా లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: