మనకు తెలిసిందే.. ఈ మధ్యకాలంలో ఒబిసిటీ అనేది ఒక పెను భూతం లా తయారైపోయింది. చిన్న - పెద్ద తేడా లేకుండా అందరూ ఒబిసిడి కారణంగా బాధపడిపోతున్నారు.  పట్టుమంటూ పది సంవత్సరాలు లేని పిల్లలు కూడా 30 - 40 కేజీల బరువుతో అల్లాడిపోతున్నారు . అయితే బరువు పెరగడం ఈజీ ఏమో  కానీ తగ్గడం  చాలా చాలా కష్టం.  అంత ఈజీ కాదు . ఈ విషయం అందరికీ తెలుసు . బరువు తగ్గడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది . మరీ ముఖ్యంగా నోటికి ప్లాస్టర్ వేసుకోవాలి . రకరకాల డైట్ ఫాలో అవ్వాలి . క్యాలరీ డైట్ ను కంపల్సరీ చూడాలి .


చెమటలు పట్టేలా కష్టపడాలి . గంటలు గంటలు వ్యాయామాలు చేయాలి . చాలామంది హీరోయిన్స్ ఇదే విధంగా చేస్తూ ఉంటారు.  కడుపునిండా అన్నం తినకుండా కడుపు మాడ్చేసుకొని మరి రకరకాల డైట్ లు ఫాలో అవుతూ వ్యాయామాలు చేస్తూ స్లిమ్ గా కనిపిస్తారు . అయితే కీర్తి సురేష్ మాత్రం ఎటువంటి డైట్ లేకుండానే తొమ్మిది కేజీలు తగ్గాను అన్న విషయాన్ని బయటపెట్టింది . ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది . 2019లో తాను ఏకంగా తొమ్మిది కేజీల బరువు తగ్గాను అంటూ క్లారిటీ ఇచ్చింది .



ఎలాంటి డైట్ లేకుండా ..బరువు తగ్గే టాబ్లెట్స్ వాడకుండానే .. తగ్గాను అన్న విషయాన్ని ఓపెన్ గానే చెప్పుకొచ్చింది. కీర్తి సురేష్ మాట్లాడుతూ.." ఆ సమయంలో నేను చాలా బొద్దుగా ఉన్నాను అని.. చాలామంది డైరెక్టర్ లు చెప్పారు . మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు . కానీ నాకు డైట్ చేయడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు . ఎలాంటి డైట్ చేయకుండా కార్డియో ఎక్కువగా చేసి బరువు తగ్గాను..అలా  చేయడం ద్వారా కండరాలు తగ్గుతాయి కాబట్టి స్ట్రెంత్ ట్రైనింగ్ అవసరం లేకుండానే కేవలం కార్డియో చేసి బరువు తగ్గచ్చు. అలా వేగంగా బరువు తగ్గడానికి ఓన్లీ  కార్డియో.   నా ముఖం బరువు తగ్గిన తర్వాత చాలా చిన్నగా అయిపోయింది.  దానికి కారణం కార్డియో.  ఎవరైతే డైట్ చేయకుండా బరువు తగ్గాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అంటున్నారు కీర్తి సురేష్ . ఇది ఇలా ఉంటే కార్డియో  ప్రభావం కాళ్లు,  బ్యాక్ పైపడుతుంది . కార్డియా వ్యాయామం కిందకి వాకింగ్ ..జాగింగ్ చేయడం.. సైక్లింగ్ .. స్విమ్మింగ్ లాంటివి వస్తాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: