టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీయర్లో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను సొంతం చేసుకుని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నాగార్జున గత కొంత కాలంగా తన రూట్ ను చాలా వరకు మార్చాడు. కేవలం సినిమాల్లో హీరో పాత్రలలో నటించడంపై మాత్రమే కాకుండా అనేక ఇతర పాత్రలలో నటించడంపై కూడా నాగార్జున దృష్టి పెట్టాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే బ్రహ్మాస్త్ర సినిమాలో కీలక పాత్రలో నటించిన నాగార్జున కొన్ని రోజుల క్రితం విడుదల అయిన కుబేర సినిమాలో కూడా కీలక పాత్రలో నటించాడు.

తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ ,  లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నాగార్జున పూర్తిగ నెగటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. దీనితో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ ఆగస్టు 14 వ తేదీన విడుదల కానుంది. దానితో నాగార్జున అభిమానులు ఎప్పుడెప్పుడు కూలీ సినిమా విడుదల అవుతుందా  .. తమ అభిమాన నటుడిని ఎప్పుడు వెండి తెరపై చూస్తామా అనే ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు నాగార్జున రానుండడంతో ఆయన అభిమానులు ఆనంద పడుతూ ఉండగా వారందరికీ నాగర్జున మరో ట్రీట్ అందిస్తున్నాడు.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను నాగార్జున ఓ వీడియో ద్వారా ప్రకటించాడు. నాగార్జున కెరియర్లో అద్భుతమైన విజయం సాధించిన మూవీలలో శివ మూవీ ఒకటి. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే 4కే వర్షన్లో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ను కూలీ సినిమాతో పాటు ప్రసారం చేయనున్నట్లు నాగార్జున ప్రకటించాడు. దీనితో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: