వైఎస్ షర్మిల రాఖీ పండుగ సందర్భంగా అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు ప్రతీక రక్షా బంధన్. రాష్ట్రంలోని ప్రతి అన్నకు, తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు అని చెప్పుకొచ్చారు. అన్ని బంధాల కన్నా రక్త సంబంధం గొప్పది. నాతో రక్త సంబంధం లేకపోయినా, ysr అనే మూడక్షరాల అనుబంధాన్ని రక్త సంబంధంగా ఏర్పరుచుకొని నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రతి అన్న, తమ్ముడు సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

అయితే షర్మిల కామెంట్లకు నెటిజన్ల నుంచి ఊహించని స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి.  ఆస్తి కోసం సొంత అన్న నాశనం కోరుకునే నీకు రక్షాబంధన్ ఎందుకు అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా  ఆస్తుల కోసం సొంత అన్నను వదిలేసుకున్నావ్.  అన్న చచ్చిపోవాలని కోరుకునే పచ్చపార్టీలకు అనుకూలంగా మాట్లాడుతున్నావ్. నిన్ను అవసరానికి వాడుకుని వదిలేసే అన్నలు నీకు ఏనాడూ న్యాయంచెయ్యరు గుర్తుంచుకో అంటూ మరో నెటిజన్ రియాక్ట్ అయ్యారు.

వైయస్ఆర్ ని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు రక్త బంధం అనుకోరు మీరు అందుకు అర్హత కోల్పోయారంటూ మరొకరు కామెంట్ చేశారు.  అన్నయ్య లోనే అయ్య ఉంటాడు అలాంటి అన్న కీడు కోరుకున్న మీరే చెప్పాలి మేడం రాఖీ గురించి అంటూ మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.  నీలాంటి చెల్లి ప్రపంచంలో ఎవరికీ ఉండకూడదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

నువ్వు మా మనిషి అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.  మరి కొందరు నెటిజన్లు రక్షా బంధన్ చెబుతుండగా మీ బాధ ఎవరికీ రాకూడదంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  షర్మిల ఈ కామెంట్ల విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: