నిన్న సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు పుట్టినరోజు . ఆయన  పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి.. ఎస్ ఎస్ ఎం బి 29 సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు . దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు . దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా లుక్స్ కోసమే దాదాపు 365 రోజులను కేటాయించారు. అంతేకాదు ఈ సినిమా కోసం ఆయన స్పెషల్ డైట్ కూడా ఫాలో అవుతున్నారట . ఒకటి రెండు మూడు రోజులు కాదు ఈ సినిమా చిత్రీకరణ ఎన్ని సంవత్సరాలు జరిగితే అన్ని సంవత్సరాలు అదే డైట్ ఫాలో అవ్వాలి మహేష్ బాబు అంటూ రాజమౌళి కండిషన్ కూడా పెట్టారట.
 

రీసెంట్గా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ సినిమాకి సంబంధించిన ఒక స్పెషల్ పిక్చర్ రిలీజ్ చేశారు. ఆ స్పెషల్ పిక్చర్ లో అందరి దృష్టి ఆ లాకెట్ పైన కనిపించింది . ఆ లాకెట్లో మూడు నామాలు ..త్రిశూలం.. ఢమరుకం.. నంది ..రుద్రాక్షలు వరుసగా అమర్చబడి ఉన్నాయి . అయితే ఇది సాధారణ లాకెట్ కానే కాదు . దీని డిజైన్ లో హిందూ మైథాలజీలో శివుడికి సంబంధించిన చాలా ప్రతీకలు ఉండడం విశేషం . శివతత్వానికి సంబంధించిన అంశాలతో మహేష్ బాబు తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి అంటూ క్లారిటీ వచ్చేసింది.

 

అయితే ఈ లాకెట్ చూసిన జనాలు "బాహుబలి" తరహాలోనే ఈ సినిమాలో కూడా శివుడు బ్యాక్ గ్రముడ్ లో సన్నివేశాలు ఉంటాయి అంటూ మాట్లాడుకుంటున్నారు . మరి కొంతమంది మాత్రం ఈ లాకెట్ ని ఎక్కడో చూసినట్టుంది అంటూ ఆరా తీయడం ప్రారంభించారు . అసలు విషయం కనిపెట్టారు . ఈ లాకెట్ ను అత్తారింటికి దారేది , బ్రో చిత్రాలలో పవన్ కళ్యాణ్ ధరించాడు . ఈ లాకెట్ అప్పట్లో ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు  . ఇప్పుడు మహేష్ బాబు మెడలో కూడా సేమ్ లాకెట్ కనిపించడంతో కొంతమంది రాజమౌళిని ట్రోల్ చేస్తున్నారు . ఏంటి పవన్ కళ్యాణ్ లుక్స్ ని కాపీ కొట్టేస్తున్నావా..? నువ్వు కూడా కాపీ రాజా అయిపోయావా రాజమౌళి ..? అంటూ కావాలనే ఓవర్గం ప్రేక్షకులు రాజమౌళి ని ట్రోల్ చేస్తున్నారు . అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి ఇలాంటి పనిచేయడం కొంచెం నెగిటివ్గా మారింది అంటున్నారు జనాలు . నవంబర్ లో ఈ సినిమా గ్లింప్స్ తో పాటు ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ పేరు కూడా రివీల్ చేయబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: