హైదరాబాద్‌లో నైజాం పరిధిలో 'వార్ 2', 'కూలీ' సినిమాల మధ్య థియేటర్ల కేటాయింపులో తీవ్ర పోటీ నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం, నైజాంలో మొత్తం థియేటర్లలో 55% 'వార్ 2' సినిమాకు, మిగిలిన 45% 'కూలీ'కి కేటాయించారు. అయితే, మల్టీప్లెక్స్‌లలో మాత్రం 'కూలీ' సినిమాకు ఎక్కువ స్క్రీన్లు లభించాయి. ఈ రెండు సినిమాలకూ రికార్డు స్థాయిలో థియేటర్లు లభించగా, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో, 'వార్ 2' సినిమాకు కొన్ని థియేటర్లలో ఎర్లీ మార్నింగ్ షోలు కూడా పడనున్నాయి. 'కూలీ' సినిమా షోలు మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి మొదలవుతాయి.

ఈ సినిమాల రికార్డు స్థాయి విడుదలతో టికెట్ ధరలు కూడా పెరగనున్నాయి. నైజాంలో 'వార్ 2', 'కూలీ' సినిమాలకు టికెట్ ధరలు రూ. 50 నుంచి రూ. 75 వరకు పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సినిమాలకు టికెట్ ధరలు పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తాయో చూడాలి.

వార్2, కూలీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. వాస్తవానికి వార్2 సినిమాకు మల్టీప్లెక్స్ లు, కూలీ  సినిమాకు సింగిల్ స్క్రీన్ థియేటర్లు కరెక్ట్ కాగా  అందుకు భిన్నంగా  జరుగుతోంది.  వార్2, కూలీ సినిమాలు రికార్డులు క్రియేట్ చేసి బాక్సాఫీస్ వద్ద కొత్త ఉత్సాహం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యకమవుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: