
రవితేజ పోలీస్ గెటప్ లో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ సెంటిమెంట్ ప్రకారం మాస్ జాతర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో రవితేజకు సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే. అయితే మాస్ జాతర విషయంలో అభిమానులు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.
రవితేజ పారితోషికం ప్రస్తుతం 25 కోట్ల రూపాయలకు అటుఇటుగా ఉందని తెలుస్తోంది. సితార నాగవంశీ మాస్ జాతర సినిమా కోసం రవితేజ మార్కెట్ ను మించి ఖర్చు చేశారనే చెప్పాలి. రవితేజ ఈ మధ్య కాలంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చూసి చాలా కాలమైంది. రవితేజ ఏ రేంజ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాడో ఆ రేంజ్ సక్సెస్ ఈ సినిమాతో దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. అతి త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయి.
కింగ్ డమ్ సినిమాతో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న నాగవంశీ తర్వాత సినిమాలతో మాత్రం భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2025 సంవత్సరం రవితేజకు కెరీర్ పరంగా కలిసిరావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఈ ఏడాది ఇండస్ట్రీ సక్సెస్ రేట్ కూడా తక్కువగా ఉందనే సంగతి తెలిసిందే.