తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ సాయిధరమ్ తేజ్  చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మండిపోయేలా చేస్తుంది. ఈ మధ్యకాలంలో మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అస్సలు పడడం లేదు . ఆ హీరోలు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో అలాగే బిహేవ్ చేస్తూ వస్తున్నారు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొట్టుకొని చచ్చిపోతున్న సరే ఆ హీరోలు ఏం పట్టించుకోకుండా వాళ్ళ సినిమా షూటింగ్ లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు . కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత పూర్తిగా మెగా ఫ్యామిలీకి దూరమైపోయారు అన్న కామెంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా విన్నాం.


రీసెంట్ గా ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ చేసిన పని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మండిపోయేలా చేసింది. రీసెంట్గా సాయిధరమ్ తేజ్ ని "ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరో ఎవరు ..?" అని హోస్ట్ ప్రశ్నించగా వెంటనే "రామ్ చరణ్ అలాగే పవన్ కళ్యాణ్ అంటూ ఆయనకి ఇష్టమైన వారి పేరుని చెప్పారు". ఆ ఒక్క మాటతో సాయి ధరంతేజ్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఎవరైనా సరే ఇండస్ట్రిలో స్టైలిష్ స్టార్ అంటే అల్లు అర్జున్ పేరే చెబుతారు.  అది అందరికీ తెలుసు . అది ఆయన ట్యాగ్ .



మరి ఆయనని ఎలా మర్చిపోయాడు సాయిధరమ్ తేజ్ అంటూ ప్రశ్నిస్తున్నారు . అంతేకాదు ఇండస్ట్రీలో అసలు కొత్త ట్రెండ్  ని తీసుకొచ్చిందే అల్లు అర్జున్ . ఆయనకి అందుకే స్టైలిష్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు . మరి సాయిధరమ్ తేజ్ ఇప్పుడు రామ్ చరణ్ అదే విధంగా పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం ఎంతవరకు న్యాయం..? అంటూ ఫైర్ అయిపోతున్నారు . కావాలనే అతనిని ఇన్సల్ట్ చేసే విధంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడాడు అంటూ పరోక్షకంగా మాట్లాడాడు అంటూ ఫైర్ అవుతున్నారు. సాయిధరమ్ తేజ్  పై పీకల్లోతు  కోపంగా ఉన్నారు బన్నీ ఫ్యాన్స్ . గతంలో కూడా అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి సాయిధరమ్ తేజ్ చేసి పరోక్షకంగా మాట్లాడిన సందర్భాలను గుర్తు చేసుకుంటున్నారు . అల్లు అర్జున్ రియల్ స్టైలిష్ స్టార్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే మా స్టైలిష్ స్టార్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు..!



మరింత సమాచారం తెలుసుకోండి: