టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా పేరు సంపాదించిన వారిలో సుధ కూడా ఒకరు.. ఈమె ఇప్పటికీ కూడా పలు చిత్రాలలో నటిస్తూ బాగానే పాపులారిటీ సంపాదించింది. ఏజ్ పైబడినప్పటికీ కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది సుధ. ఎన్నో చిత్రాలలో తల్లిగా, అక్కగా అద్భుతమైన పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటివరకు సుమారుగా ఈనటి 500 కు పైగా చిత్రాలలో నటించింది. సుధ కెరియర్ లోనే ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. ఈమె తప్ప మరెవరు కూడా ఈమె పాత్రలో నటించలేరు అనేటట్టుగా నటిస్తుంది.


ప్రస్తుతం ఇమే వయసు 61 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా యంగ్ గానే కనిపిస్తున్నది. అలా యంగ్గా ఫిట్టుగా కనిపించడానికి గల విషయాలను తాజాగా తెలియజేసింది సుధ. తాను నీటిని తాగేటప్పుడు అందులోకి వాము, వేడి నీళ్లు కలుపుకొని తాగుతానని తెలియజేసింది. అందువల్లే తాను ఇప్పటికీ కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తానని తెలియజేసింది. ఆ వేడి నీళ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు మొత్తం కరిగిపోవుతుందని తెలియజేసింది. అలా వేడి నీళ్లు చిన్న వయసు నుంచే తాగుతూ ఉన్నానని తెలియజేసింది.. తన హెల్త్ సీక్రెట్స్ కి మాత్రం ఈ నీరే కారణమని తెలియజేసింది సుధ.


గతంలో బిజినెస్ లో కూడా పెట్టి కొన్ని కోట్ల రూపాయల డబ్బులను పోగొట్టుకున్నది. తన బాల్యంలోనే తల్లిని కోల్పోయి తన తండ్రి కూడా క్యాన్సర్ బారిన పడడంతో చిన్న వయసులోనే చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నానని.. బంధువులు కూడా ఒకానొక సమయంలో తమని దూరం పెట్టారని వెల్లడించింది. మాతృదేవోభవ చిత్రంలో జరిగిన చాలా సంఘటనలు తన జీవితంలో కూడా జరిగినట్లు వెల్లడించింది సుధ. ప్రస్తుతం చెన్నైలో ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతోంది. తన భర్త కొడుకు అమెరికాలో ఉంటున్నారని కొన్ని కారణాల చేత ఈమెను దూరం పెట్టారట.

మరింత సమాచారం తెలుసుకోండి: