ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ డేటాబేస్ `ఐఎండీబీ` ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ప్రాముఖ్యతను క‌లిగి ఉంది. సినిమా రేటింగ్‌ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఐఎండీబీ.. ప్ర‌తి ఏడాది అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాల జాబితాను విడుద‌ల చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా టాప్ 10 మోస్ట్‌ అవైటెడ్ ఇండియన్‌ ఫిల్మ్స్ లిస్ట్ ను ఐఎండీబీ(ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌) ప్ర‌క‌టించారు. దాని ప్ర‌కారం ఏ సినిమా ఏ స్థానంలో ఉందో ఓ లుక్కేసేయండి.


ఐఎండీబీ లిస్ట్ ప్ర‌కారం.. మోస్ట్‌ అవైటెడ్‌ ఇండియన్‌ మూవీస్‌ జాబితాలో `వార్ 2` అగ్ర‌స్థానంలో నిలిచింది. 41 శాతం మంతి ప్ర‌జ‌లు వార్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేసిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఆగ‌స్టు 14న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కానుంది.


టాప్ 2లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ `కూలీ` మూవీ నిలిచింది. 38.5 శాతం మంది ప్ర‌జ‌లు కూలీ రిలీజ్ కోసం అతృత‌గా ఉన్నారు. అయితే లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం కూడా రేపే విడుద‌ల కాబోతుంది. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విల‌న్ గా యాక్ట్ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.


టాప్ 3లో బాలీవుడ్ ఫిల్మ్ `బాఘీ 4` ఉంది. టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్, సోనమ్ బజ్వా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమా కోసం 4.3 శాతం మంది ప్ర‌జ‌లు వెయిట్ చేస్తున్నారు. ఆ త‌ర్వాత స్థానాల్లో ధూమ్‌కేతు(3.3%), ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ(2.9%), అంధేరా(2.7%), తేజ స‌జ్జా మిరాయ్‌(2.4%), నిశాంచి(1.7%), లోకా చాప్ట‌ర్ 1: చంద్ర‌(1.6%), దుల్క‌ర్ స‌ల్మాన్ కాంత‌(1.6%) చిత్రాటు టాప్ 10లో వ‌రుస‌గా నిలిచాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: