బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే సందడి ఎంత ఉంటుందో.. అంతకంటే డబుల్ రేంజ్‌లో హీట్ కూడా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇద్దరు బడా హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే మాత్రం అందరి కళ్లూ ఆ సినిమాలపైనే ఉంటాయి. కొంతమంది పాజిటివ్‌గా, మరికొంతమంది నెగిటివ్‌గా, ఇంకొందరు కాంట్రవర్షియల్‌గా స్పందిస్తూనే ఉంటారు. అయితే సినిమాను సినిమా గానే చూసి, ఫ్రెండ్షిప్‌ను మెయింటైన్ చేస్తే ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఒక సినిమా, రెండు సినిమాలు కాదు, పది సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయినా పది సినిమాలు పాజిటివ్ టాక్ దక్కించుకోవచ్చు.
 

అదే ప్రూవ్ చేశాయి వార్ 2 మరియు కూలీ సినిమాలు. ఈ రోజు ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. నిజానికి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయని తెలియగానే, ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో సోషల్ మీడియాలో మాటల తూటాలు పేల్చుకున్నారు. అయితే మూవీ మేకర్స్ మాత్రం ఎక్కడా కూడా ఒక సినిమాను మరో సినిమాతో కంపేర్ చేస్తూ మాట్లాడలేదు. అంతేకాదు, హృతిక్ రోషన్ కూడా కూలీ సినిమాకు సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ఒకరి మీద ఒకరు నిందలు వేయకుండా, రెండు బడా సినిమాలు చక్కగా ఒకదానిని ఒకటి సపోర్ట్ చేసుకున్న కారణంగా, రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను దక్కించుకున్నాయి. తాజాగా రిలీజ్ అయిన కూలీ అలాగే వార్ 2 కూడా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నాయి.



కూలీతో కంపేర్ చేస్తే వార్ 2 ఒక అడుగు వెనుక ఉంది..అయితే  కలెక్షన్స్ పరంగా మాత్రం వార్ 2 ఎక్కడ తగ్గేదే లేదు అన్న రేంజ్‌లో దూసుకుపోతోంది అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ రెండు సినిమాల వల్ల ఇండస్ట్రీ నేర్చుకున్న గుణపాఠం ఏమిటంటే — బిగ్ స్టార్ హీరోస్ అయినా సరే, ఫ్రెండ్షిప్‌ను మెయింటైన్ చేస్తూ, కాంట్రవర్సీకి దూరంగా ఉండి, సినిమాను ఉన్నది ఉన్నట్లు  ప్రమోట్ చేస్తే బాగా హిట్ అవుతాయి. తద్వారా మేకర్స్‌కి, కార్మికులకి లాభం చేకూరుతుంది. గతంలో బిగ్ స్టార్ హీరోస్ సినిమాలు ఒకే తేదీన రిలీజ్ అవుతాయని తెలిసిన వెంటనే, కొందరు ఒక సినిమాను మరొక సినిమా దెబ్బతీయడానికి ప్రయత్నించి, ఫ్యాన్స్ హంగామా కంట్రోల్ చేయలేక, రెండు సినిమాలు కూడా నష్టపోయిన సందర్భాలను ఇప్పుడు జనాలు గుర్తు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: