
కియరా అద్వానీ పాత్ర ఈ సినిమాలో హైలైట్ అవుతుందని ముందే అనుకున్నారు. కానీ ఆమెకు సంబంధించిన కొన్ని సీన్స్ ట్రిమ్ చేయడం వల్ల, ఆ పాత్ర పెద్దగా ఎలివేట్ కాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. “గ్లామర్ టచ్ కోసం మాత్రమే కీయరాని వాడుకున్నారు” అని కూడా కొందరు మాట్లాడుతున్నారు. టాలీవుడ్‌లో వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌కి ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇచ్చిన స్పీచ్ అని అంటున్నారు .. ఆయన ఒక బడా హీరోని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడారని, ఆ హీరో అభిమానులు ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారని సమాచారం. .
వాస్తవానికి సినిమా బాగుంది, ఇదే సినిమా వేరే నటుడు నటించి ఉంటే, మంచి రివ్యూస్ వచ్చేవని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. కథ పాతదే అయినా, దానిని తీర్చిదిద్దిన తీరు, జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్‌ల ప్రదర్శన, అలాగే అయాన్ ముఖర్జీ టాలెంట్ తప్పక ప్రశంసించాల్సిందే అని వారు అంటున్నారు. కొంత పాజిటివ్, కొంత నెగటివ్ టాక్ మధ్య ఈ ‘వార్ 2’ మూవీ ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. .