
ఇక అదే సమయంలో రంగస్థలం సీక్వెల్ కథను కూడా తన టీమ్‌తో కలిసి రెడీ చేయిస్తున్నాడని సమాచారం. కథ రూపకల్పన కోసం దుబాయ్ వెళ్ళాలని సుకుమార్ భావిస్తున్నాడట. అక్కడే ప్రశాంత వాతావరణంలో బౌండ్ స్క్రిప్ట్‌ని లాక్ చేసి, చరణ్‌కి ఫైనల్‌గా వినిపించాలనుకుంటున్నాడని టాక్.ఈ సీక్వెల్‌లో కథ ఏ దిశగా వెళ్తుందో ఇంకా రహస్యంగానే ఉంచుతున్నారు. అయితే, మొదటి భాగంలో పల్లెటూరు, కులపరమైన రాజకీయాలు, భావోద్వేగాల మేళవింపుతో పబ్లిక్‌ను కట్టిపడేసిన సుక్కూ, ఈసారి మరింత మాస్ మరియు ఇంటెన్స్ పాయింట్‌ను తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చరణ్ పాత్ర మళ్లీ రంగమల్లిగా వస్తుందా? లేక కొత్త సెట్టింగ్‌లో, కొత్త షేడ్స్‌తో వస్తాడా? అన్నదానిపై ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్ నెలకొంది.
నిర్మాణ బాధ్యతలు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భుజాన వేసుకుంటున్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో, టెక్నికల్‌గా టాప్ లెవెల్‌లో తెరకెక్కించాలన్న ఆలోచనలో ఉన్నారు. పుష్ప 2 తరువాత మైత్రి బ్యానర్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా, ప్రొడక్షన్ వాల్యూమ్ పరంగా రికార్డులు బద్దలుకొట్టేలా ప్లాన్ చేస్తున్నారు.మొత్తం మీద, పుష్పరాజ్ హవా తర్వాత సుకుమార్ రంగమల్లీ హవా తెచ్చేందుకు సెట్ అవుతున్నాడు. ఒకవైపు పాన్ ఇండియా క్రేజ్ ఉన్న చరణ్, మరోవైపు మాస్-క్లాస్ రెండింటినీ బ్యాలెన్స్ చేసే సుక్కూ- ఈ కాంబో మళ్లీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక ఫ్యాన్స్‌కి మాత్రం పుష్ప 2 తరువాత ఎదురుచూడాల్సిన మరో మాస్ ఫెస్టివల్ ఖాయం!