జూనియర్ ఎన్టీఆర్ ఆఖరిగా నటించిన ఆరు మూవీలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి ఫ్రీ రిలీజ్ బిజినెస్లు జరిగాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

వార్ 2 : ఈ సినిమాలో తారక్ తో పాటు హృతిక్ రోషన్ కూడా హీరోగా నటించాడు. భారీ మల్టీ స్టారర్ మూవీగా రూపొందిన ఈ సినిమా ఈ రోజు అనగా ఆగస్టు 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 90.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

దేవర : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 112.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఆర్ ఆర్ ఆర్ : ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ మల్టీ స్టారర్ మూవీగా రూపొందిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 191 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అరవింద సమేత  : జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 67 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

జై లవకుశ : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు బాబి కొల్లి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 67.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

జనతా గ్యారేజ్ : తారక్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 47.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

తారక్ నటించిన ఆఖరి ఆరు మూవీలలో ఆర్ ఆర్ ఆర్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: