నందమూరి బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నది మోక్షజ్ఞ ఎంట్రీ కోసమే అని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్లుగా అభిమానులను ఊరిస్తూ ఉన్నప్పటికీ ఎట్టకేలకు గత ఏడాది డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మాత్రమే విడుదల చేశారు. అయితే ఆ తర్వాత షూటింగ్ మొదలవుతుందనుకున్న సమయంలో అనుకోకుండా ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్లు లేవు. కానీ మరి కొంతమంది డైరెక్టర్ల పేర్లు మాత్రం ఎక్కువగా వినిపించాయి.


ఇక మోక్షజ్ఞ ఎలాంటి చిత్రంతో ఎంట్రీ ఇస్తే బాగుంటుందనే విషయంపై పలు రకాల చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే అసలు మోక్షాజ్ఞ ఎలాంటి చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడనే విషయంపై హీరో నారా రోహిత్ క్లారిటీ ఇచ్చారు. నారా రోహిత్ నటించిన సుందరకాండ సినిమా ఈనెల 27న విడుదల కాబోతున్న సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగానే మోక్షజ్ఞ ఎంట్రీ పైన  నారా రోహిత్ ను మీడియా ప్రశ్నించారు.


ఈ విషయం పైన నారా రోహిత్ స్పందిస్తూ.. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులే కాదు తాను కూడా ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నానని ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది మొదటిలో ఉంటుందని తెలిపారు. తను మొదటి చిత్రం కోసం ఒక ప్రేమ కథ అయితే బాగుంటుందని అలాంటి కథ కోసమే మోక్షజ్ఞ చూస్తున్నాడని తనతో చెప్పాడని తెలిపారు నారా రోహిత్.. ఏది ఏమైనాప్పటికీ మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో మాత్రం నందమూరి అభిమానులు కొంతమేరకు నిరాశ తో కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పుడు కూడా చాలానే ట్రోల్స్ వినిపించాయి. మరి వాటన్నిటిని దాటుకొని మోక్షజ్ఞ తన మొదటి సినిమాతో సక్సెస్ అందుకొని చూపిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: