తెలుగు సినీ చ‌రిత్ర‌లో మెగాస్టార్ చిరంజీవి ఒక లెజెండ్. సాదాసీదా కుటుంబంలో పుట్టి, కష్టాలు ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానానికి ఎదిగారు. కెరీర్ ప్రారంభంలో పెద్దగా అవకాశాలు లభించలేదు. హీరోగా స్థిరపడటానికి చాలానే స్ట్రగుల్ అయ్యారు. కుటుంబ ప‌రిస్థితులు అతంత మాత్రంగానే ఉన్న వెన‌క‌డుగు మాత్రం వేయ‌లేదు. కృషి, ప‌ట్టుద‌ల‌తో జీరో నుంచి ప్రారంభ‌మై స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌నను ఆరాధించే అభిమానులుగా మార్చుకున్నారు.


నేటికీ మెగాస్టార్ అనే బిరుదుకు తగ్గట్టుగానే నిలుస్తున్నారు. కేవలం సినిమాల్లోనే కాదు, కుటుంబ జీవనంలోనూ ఎంత మంద‌కి ఆదర్శంగా నిలిచారు. ఇక చిరంజీవి సేవా గుణం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రీల్ లైఫ్‌లో హీరోగా మెరిసిన మెగాస్టార్.. రియ‌ల్ లైఫ్‌లోనూ త‌న‌ సేవా గుణంతో ప్ర‌జ‌ల‌ హృద‌యాలు గెలుచుకున్నారు. సామాన్యులు, అభిమానుల‌నే కాదు క‌ష్టాల్లో ఉన్న త‌న తోటి కోస్టార్స్ ను ఆదుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. చిరంజీవి సాయం పొందిన వారిలో కోలీవుడ్ న‌టుడు శ‌ర‌త్‌కుమార్ ఒక‌రు. గ‌తంలో ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు.


ఒకానొక సంద‌ర్భంలో చిరు చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ శ‌ర‌త్ కుమార్ చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. శరత్ కుమార్ మాట్లాడుతూ.. `ఒక సమయంలో నా కెరియర్ పూర్తిగా డౌన్ అయింది. అప్పులు బాగా పెరిగిపోయాయి అప్పుడే ఓ నిర్మాత నా దగ్గరకు వచ్చి చిరంజీవి గారి డేట్స్‌ పట్టుకొస్తే ఆయ‌న‌తో సినిమా తీసి వచ్చిన ప్రాఫిట్స్ లో మీ అప్పులన్నీ తీర్చుకునేలా హెల్ప్ చేస్తా అన్నారు. వేరే ఆప్ష‌న్ లేక‌ చిరంజీవిని పర్సనల్ గా కలిసాను. ఓ మూవీ ఫైట్ షూట్ లో ఉన్న ఆయన నేను వెళ్ల‌గానే దర్శకనిర్మాతులకు చెప్పి మధ్యలోనే వచ్చారు.


నాకు భోజనం వ‌డ్డించి విషయం చెప్పమని అడిగారు. జరిగిందంతా చెప్పి డేట్స్ కావాలని అడిగాను. మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి కాగానే డేట్స్ నీకే ఇస్తా ఏర్పాట్లు చేసుకో అన్నారు. రెమ్యునరేషన్ గురించి అడగ్గా.. నువ్వు నాకు రెమ్యున‌రేష‌న్ ఇస్తావా? అంటూ కోప‌డ్డారు. ప్రాబ్ల‌మ్స్ లో ఉన్నా అన్నావ్‌.. ఏం వ‌ద్దు.. డేట్స్ ఇస్తా అంతే.. అని చెప్పి న‌న్ను పంపారు` అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. రెమ్యున‌రేష‌న్ లేకుండా సినిమా చేసి నా అప్పులు తీర్చ‌డానికి చిరంజీవి ఎంత‌గానో సాయ‌ప‌డ్డార‌ని శ‌ర‌త్ కుమార్ గ‌తంలో వెల్లడించారు. నేడు చిరు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ విష‌యం మ‌రోసారి నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. ఫ్యాన్స్ మ‌రియు నెటిజ‌న్లు `నువ్వు నిజంగా గ్రేట్ బాసూ` అని మెగాస్టార్‌ను ప్ర‌శంసిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: