
ఇదే ఫీట్ బాలయ్య, నానికి కూడా! .. ఇలాంటి అరుదైన క్లాష్ ఇంతకు ముందు ఇండస్ట్రీలో కొన్ని సార్లే జరిగింది. 1993 సెప్టెంబర్ 3న నందమూరి బాలకృష్ణ నటించిన “బంగారు బుల్లోడు” మరియు “నిప్పురవ్వ” ఒకేసారి విడుదలయ్యాయి. వీటిలో బంగారు బుల్లోడు హిట్ అవ్వగా, నిప్పురవ్వ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. “విడిగా వచ్చి ఉంటే రెండూ ఆడేవి” అని ఫ్యాన్స్ అప్పటికీ, ఇప్పటికీ చెబుతుంటారు. అలాగే 2015 మార్చి 21న నాని కెరీర్‌లో కూడా ఇదే పరిస్థితి. ఒకేసారి “ఎవడే సుబ్రహ్మణ్యం”, “జెండాపై కపిరాజు” థియేటర్లలోకి వచ్చాయి. ఫలితం? ఎవడే సుబ్రహ్మణ్యం మంచి హిట్ సాధించగా, జెండాపై కపిరాజు ఘోరంగా బోల్తా పడింది. మీడియాలో అప్పట్లో ఈ సెల్ఫ్ క్లాష్ గురించి రకరకాల కథనాలు వెలువడ్డాయి.
ప్రదీప్ సవాల్ – ఏ సినిమా నిలుస్తుంది? .. ఇప్పుడు అదే పరిస్థితి ప్రదీప్ రంగనాధన్ ముందు. ఒకవైపు లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ – విగ్నేష్ శివన్ దర్శకత్వం, కృతి శెట్టి హీరోయిన్, మంచి ఫ్యామిలీ టచ్. మరోవైపు డ్యూడ్ – movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం, గ్లామర్ కోటింగ్‌తో యూత్‌ఫుల్ మాస్ ఎంటర్టైనర్. దీపావళి సీజన్ కోలీవుడ్‌లో కీలకం కావడంతో ఇద్దరు నిర్మాతలు కూడా వెనక్కి తగ్గడం లేదు. అందుకే ఇప్పుడు ఫ్యాన్స్‌లో ఒక్క ప్రశ్నే – “ప్రదీప్ తనతో తనే తలపడతాడా? లేక ఎవరినో ఒప్పించి రిలీజ్ వాయిదా వేస్తాడా?” అని. ఒకవేళ క్లాష్ నిజమైతే మాత్రం ప్రదీప్ రంగనాధన్ పేరు కూడా బాలయ్య, నాని సరసన లిస్ట్‌లో చేరిపోతుంది.