పైన ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా? ప్రస్తుతం అతను టాలీవుడ్ లో క్రేజీ హీరో. బడా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ.. తనదైన ప్రతిభతో ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. ఇంతకీ ఆ బుడ్డోడు మరెవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. శుక్రవారం చిరంజీవి బర్త్‌డే కావడంతో వరుణ్ ఈ త్రోబ్యాక్ ఫోటోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ పెదనాన్నకు విషెస్ తెలియజేసాడు. దీంతో వరుణ్ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట‌ వైరల్ గా మారింది.


ఇకపోతే శ్రీకాంత్‌ అడ్డాల తెర‌కెక్కించిన `ముకుంద‌`తో 2014లో హీరోగా వెండితెరపై అడుగుపెట్టిన వరుణ్ తేజ్‌.. తన హైట్, స్క్రీన్ ప్రెజెన్స్ ద్వారా తొలి సినిమాతోనే మంచి అటెన్షన్ దక్కించుకున్నాడు. ఆ మ‌రుస‌టి ఏడాది క్రిష్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన‌ `కంచె` మూవీ వ‌రుణ్ కెరీర్‌కు మ‌రింత ఊపు తెచ్చింది. ఈ చిత్రంలో వరుణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. కంచె స‌క్సెస్ త‌ర్వాత వ‌రుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీ అయ్యాడు.


ఒకే త‌ర‌హా స్టోరీ వైపు ప‌రుగులు పెట్ట‌కుండా స్క్రిప్ట్ సెల‌క్ష‌న్‌లో వేరియేష‌న్స్ చూపిస్తూ న‌టుడిగా టాలీవుడ్ లో త‌న‌కంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. టైర్ 2 హీరోల జాబితాలో చోటు ద‌క్కించుకున్నాడు. అయితే గ‌త కొంత కాలం నుంచి వ‌రుణ్ కు స‌రైన హిట్ లేదు. `ఎఫ్ 3` అనంత‌రం `గండీవధారి అర్జున`, `ఆపరేషన్ వాలెంటైన్`, `మ‌ట్కా` చిత్రాలతో అదృష్టాన్ని ప‌రీక్షించుకున్న వ‌రుణ్ తేజ్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ప్ర‌స్తుతం త‌న కెరీర్‌లో 15వ చిత్రం చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు మేర్లపాక గాంధీ దర్శకుడు. ఇండో-కొరియన్ హర్రర్-కామెడీగా ఈ మూవీ రాబోతుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: