తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ గ‌ట్టిగా న‌డుస్తోంది. స్టార్ హీరోల పాత హిట్స్‌ను స్పెష‌ల్ డేస్‌ పుర‌స్క‌రించుకుని విడుద‌ల చేయ‌డం.. క‌లెక్ష‌న్స్ తో రికార్డులు సెట్ చేయ‌డం చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుక్ర‌వారం `స్టాలిన్` మూవీని 4కె వెర్ష‌న్‌లో భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. ఈ వీక్ లో పెద్దగా నోటబుల్ మూవీస్ ఏమీ లేక‌పోవ‌డంతో స్టాలిన్ బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులుపుతుంద‌ని సినీ విశ్లేష‌కులు అంచ‌నా వేశారు. కానీ మూవీ ఏమాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయ‌లేక‌పోయింది.


సినీ ప్రియులే కాదు మెగా ఫ్యాన్స్ కూడా స్టాలిన్ వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. మొద‌టి రోజు దారుణ‌మైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రేక్షకుల కొరత కారణంగా చాలా షోలు ప్రారంభం కాకముందే క్యాన్సిల్ చేశారు. ఫ‌లితంగా కలెక్షన్స్‌లో కనీసం టాప్ 20లో కూడా ఈ చిత్రం చోటు ద‌క్కించుకోలేక‌పోయింది. రీ రిలీజ్‌లో స్టాలిన్ డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో బ‌ర్త్‌డే నాడే మెగా ఫ్యాన్స్ చిరు ప‌రువు తీసిన‌ట్లు అయింది.


కాగా, ఏఆర్ మురగదాస్ డైరెక్ట్ చేసిన పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామా ఇది. త్రిష హీరోయిన్ కాగా.. ఖుష్బు సుందర్, ప్రకాష్ రాజ్, శారద, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం సహాయక పాత్రలు పోషించారు. నాగ‌బాబు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. 2006 సెప్టెంబ‌ర్ 20న విడుద‌లైన స్టాలిన్ మూవీ సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: