
కానీ కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. స్టార్స్ బయటకి వస్తే, వారి పిల్లల ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి వ్యూస్ సంపాదించాలని చూస్తున్నారు. తాజాగా, దీపిక తన బిడ్డను ఎత్తుకొని ఉన్నప్పుడు, ఒక ఫోటోగ్రాఫర్ ఆమె ప్రైవసీని ఉల్లంఘిస్తూ ఫోటోలు తీశాడు. దీన్ని గమనించిన దీపిక వెంటనే అతనిని మందలించి, ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయమని కోరింది. అయినప్పటికీ ఆ వ్యక్తి వినకుండా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో దీపిక తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. "ఇలా ఎలా చేయగలరు?" అంటూ ఇతర సెలబ్రిటీలు కూడా మండిపడుతున్నారు. దీపిక సైతం ఫైర్ అవుతూ, "పేరెంట్స్ అనుమతి లేకుండా చిన్నారి ఫోటో తీయడం తప్పు, వాటిని షేర్ చేయడం ఇంకా తప్పు" అంటూ ఘాటుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీపిక ఆవేదనకు చాలా మంది స్టార్ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. "మేము కూడా మనుషులమే, మాకు ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. కొంచెం ప్రైవసీ ఇవ్వండి" అంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు "బుద్ధి లేదా రా? చంటి బిడ్డ ప్రైవసీ వాళ్లది. కడుపుకి అన్నం తినేవారు ఎవరైనా ఇలా చేస్తారా?" అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా వైరల్ అవుతోంది.
