టాలీవుడ్ కింగ్ నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. మొద‌ట చైల్డ్ ఆర్టిస్ట్‌గా, ఆ త‌ర్వాత హీరోగా ట‌ర్న్ తీసుకున్నాడు. క‌థానాయ‌కుడిగా కెరీర్ ప్రారంభం ద‌శాబ్దం పూర్తైనా ఇంత‌వ‌ర‌కు అఖిల్‌కు స‌రైన బ్రేక్ రాలేదు. చివ‌రిగా అఖిల్ నుంచి వ‌చ్చిన చిత్రం `ఏజెంట్‌`. అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ ఫిల్మ్ ఇది. సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీని రూ. 70 కోట్ల‌ బ‌డ్జెట్ తో రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంక‌ర నిర్మించారు.


అఖిల్ ఈ చిత్రం కోసం ఎంత‌గానో శ్ర‌మించాడు. కానీ, ఆయ‌న‌కు శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం ల‌భించ‌లేదు. 2023లో విడుద‌లైన ఏజెంట్ బాక్సాఫీస్ వ‌ద్ద‌ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాల‌ను మిగిల్చింది. ఈ సినిమా రిజ‌ల్ట్‌ అఖిల్‌ను తీవ్రంగా కృంగ‌దీసింది. ఏజెంట్ ఫ్లాప్ త‌ర్వాత అఖిల్ మ‌రో స్క్రిప్ట్‌ ఓకే చెప్ప‌డానికి చాలా స‌మ‌య‌మే తీసుకున్నాడు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో నిర్మాత అనిల్ సుంక‌ర్‌.. ఏజెంట్ తెచ్చిన న‌ష్టాల‌ను గుర్తు చేసుకుంటూ అఖిల్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని రివీల్ చేశారు.


సాధార‌ణంగా హీరో, హీరోయిన్లు సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా త‌మ రెమ్యున‌రేష‌న్ తాము తీసేసుకుంటారు. నిర్మాత‌ల ఇబ్బందుల గురించి ప‌ట్టించుకోరు. కానీ అఖిల్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఏజెంట్ కోసం దాదాపు రెండేళ్లు క‌ష్ట‌ప‌డినా పైసా రెమ్యున‌రేష‌న్ కూడా తీసుకోలేదట‌. సినిమా మంచి విజ‌యం సాధిస్తే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటాన‌ని నిర్మాత‌ల‌కు ముందే అఖిల్ చెప్పాడ‌ట‌. ఇక ఏజెంట్ ఫ్లాప్ కావ‌డంతో అఖిల్ ఒక్క రూపాయి కూడా పారితోషికం అడ‌గ‌లేద‌ని తాజాగా ప్రొడ్యూస‌ర్ వెల్ల‌డించారు. దీంతో అఖిల్ నిజంగా బంగార‌మేరా అంటూ ఫ్యాన్స్ మ‌రియు నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నాయి. అఖిల్ గొప్ప మ‌న‌సు ముందు నాగ్, చైతు కూడా స‌రిపోర‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: