కోలీవుడ్లో హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే నటించింది చిత్రం కూలీ. డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించగా మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే కలెక్షన్స్ పరంగా కూడా పెద్దగా రాబట్టలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం తమిళనాడులో మాత్రమే మొదటి రోజు భారీ కలేక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. కూలీ సినిమా ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతోంది. రజనీకాంత్ తదుపరి సినిమా ఏంటి అనే విషయంపై అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. జైలర్ 2 సినిమా షూటింగ్లో పాల్గొంటున్న రజినీకాంత్ ఆ తర్వాత డైరెక్టర్ జ్ఞానవేల్, సెల్వరాజ్, శివ తదితర డైరెక్టర్లు రజనీకాంత్ కి కథలు చప్పగా గ్రీన్ సిగ్నల్ ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి.


కానీ ఇటీవలే కూలీ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజు అటు కమలహాసన్ ,రజనీకాంత్ కాంబినేషన్లో ఒక భారీ మల్టీ స్టార్లర్ తీయబోతున్నట్లు తమిళ మీడియాలో తెగ వార్తలు వినిపించాయి. ఈ చిత్రాన్ని కమలహాసన్ బ్యానర్ పైన తెరకెక్కించే విధంగా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన అయితే వెలుబడలేదు. కానీ తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం వీరందరూ కాదు తెలుగు డైరెక్టర్ చేయబోతున్నట్లు వినిపిస్తోంది.

మహానటి, కల్కి వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సినిమా చేయడానికి రజినీకాంత్ మక్కువ చూపుతున్నారని టాక్ వినిపిస్తోంది.రజనీకాంత్ కు కూడా ఒక కథ చెప్పారని ఈ కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫుల్ కథను రెడీ చేయమన్నారని చెన్నై వర్గాలలో వార్త హల్చల్ చేస్తోంది. ఒకవేళ అన్ని కుదిరితే ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పైనే నిర్మించాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కల్కి 2 తర్వాత తీస్తారా? ముందే తీస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: