టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన ఈమేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ ముందు వరుసలో ఉంటారు. వీరు ముగ్గురు కూడా అనేక సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. వీరు ముగ్గురు ఇప్పటికి కూడా మంచి విజయాలను అందుకుంటు తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా ఓ విషయంలో సేమ్ ఫార్ములాను ఫాలో అవుతున్నారు.

అది ఎందులో అనుకుంటున్నారా ..? తమకు ఆల్రెడీ హిట్స్ ఇచ్చిన దర్శకులతో సినిమాలు చేసే విషయంలో ... అసలు విషయం లోకి వెళితే ... చిరంజీవి కొంత కాలం క్రితం బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన వాల్టేరు వీరయ్య అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. చిరంజీవి మరోసారి బాబి కొల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇది వరకే బాలకృష్ణ , బోయపాటి కాంబోలో సింహ , లెజెండ్ , అఖండ అనే మూడు సినిమాలు వచ్చాయి.

ఆ మూడు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. బాలకృష్ణ తన తదుపరి మూవీ ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నాడు. గతంలో బాలకృష్ణ , గోపి కాంబోలో వీర సింహా రెడ్డి అనే సినిమా వచ్చి మంచి  విజయాన్ని సాధించింది. వెంకటేష్ , వి వి వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వెంకటేష్ , వినాయక్ కాంబోలో లక్ష్మీ అనే మూవీ వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇలా ఈ ముగ్గురు సీనియర్ స్టార్ హీరోలు తమకు ఆల్రెడీ హిట్స్ ఇచ్చిన దర్శకులతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: