ఈ మధ్య కాలంలో మెగా హీరోలు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించడం లేదు. చిరంజీవి గత సినిమా భోళా శంకర్, రామ్ చరణ్ గత సినిమా గేమ్ ఛేంజర్, పవన్ కళ్యాణ్ గత సినిమా హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. అయితే ఈ ముగ్గురు హీరోలు భవిష్యత్తు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రామ్ చరణ్ పెద్ది సినిమాతో,  చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో  బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  ఈ మూడు సినిమాలు సంచలన  విజయం సాధిస్తే మెగా హీరోలు మరికొన్ని రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మెగా హీరోలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

పెద్ది సినిమాకు బుచ్చిబాబు, మన శంకర వరప్రసాద్ గారు  సినిమాకు అనిల్ రావిపూడి,  ఓజీ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవలం 6 నెలల గ్యాప్ లో ఈ మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.  ఈ మూడు సినిమాల బడ్జెట్ దాదాపుగా 1000 కోట్ల రూపాయలు  కావడం గమనార్హం. ఆ స్థాయి బడ్జెట్ ను ఈ సినిమాలు ఎంతమేర రికవరీ చేస్తాయో చూడాల్సి ఉంది.

ప్రస్తుతం మెగా హీరోలు కచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పెద్దగా పోటీ లేకుండానే  థియేటర్లలో  ఈ సినిమాలు విడుదల కానున్నాయి. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న మెగా హీరోలు  కెరీర్ పై సరైన విధంగా దృష్టి పెడితే మాత్రం  క్రియేట్ చేసే రికార్డులు మాములుగా ఉండవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: