
ఇలాంటి సమయంలో నాగార్జునకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. సుమారు 8 నెలల వయసులోనే ఆయన మొదటిసారి తెరపై కనిపించారు. ఆ సినిమా మరేదో కాదు, ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన "వెలుగునీడలు". ఆ తర్వాత సుడిగుండాలు సినిమాలో బాలనటుడిగా కనిపించారు. ఇక 1986లో "విక్రమ్" సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన, నిన్న కాక మొన్న విడుదలైన కూలి సినిమాలో విలన్ షేడ్స్ పాత్రలో నటించారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీపై పూర్తిగా దృష్టి పెట్టి బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ అందుకున్నారు.
నాగార్జున కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశారు. కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే ఆయనను ప్రజలకు సరిగ్గా పరిచయం చేసిన సినిమా మాత్రం "శివ". 1989లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్, బ్లాక్‌బస్టర్ హిట్. భారతీయ సినిమాలలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మాఫియా నేపథ్యం, కాలేజ్ రాజకీయాలు, హింసను వాస్తవికంగా చూపించడం.. అప్పట్లో సంచలనం సృష్టించాయి. తెలుగు సినిమా రూపురేఖలనే మార్చేశాయి.
అప్పటివరకు నాగార్జున అంటే కేవలం నాగార్జున మాత్రమే. కానీ శివ సినిమా తర్వాత ఆయన ఇండస్ట్రీ స్థాయిని పెంచిన నటుడిగా గుర్తింపు పొందారు. ఈ సినిమాలో ఆయన చైన్ లాగిన విధానం అప్పట్లో ఓ సెన్సేషన్ అని చెప్పాలి. ఈ సినిమాలో నాగార్జునతో పాటు అమల, రఘువరన్, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.