తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన చాలా సంవత్సరాల క్రితం నితిన్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన దిల్ అనే మూవీతో నిర్మాతగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈయనకు నిర్మాతగా సూపర్ గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత చాలా కాలం పాటు ఈయన బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ సాలిడ్ విజయాలను అందుకోవడంతో తక్కువ కాలంలోనే దిల్ రాజుకు అద్భుతమైన గుర్తింపు దక్కింది. ఇలా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన ఈయనకు ఈ మధ్య కాలంలో మాత్రం ఆ స్థాయి విజయాలు అస్సలు దక్కడం లేదు.

ఈ సంవత్సరం దిల్ రాజు బ్యానర్ నుండి మూడు సినిమాలు వచ్చాయి. మొదటగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఈయనకు భారీ షాక్ ను ఇచ్చింది. ఆ తర్వాత తక్కువ గ్యాప్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈయనకు అదిరిపోయే రేంజ్ లాభాలను తీసుకువచ్చింది. గేమ్ చెంజర్ మూవీ ద్వారా ఈయనకు పెద్ద షాక్ తగిలిన దాని నుండి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా చాలా తక్కువ సమయంలోనే దిల్ రాజు బయటపడ్డాడు. ఇక కొంత కాలం క్రితం ఈయన నిర్మించిన తమ్ముడు సినిమా విడుదల అయింది. ఈ సినిమాపై దిల్ రాజు భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

కానీ ఈ సినిమా కూడా దిల్ రాజుకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇక తమ్ముడు సినిమా పూర్తి కాగానే నితిన్ హీరోగా బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే సినిమాలు మొదలు పెడతాను అని దిల్ రాజు చెప్పాడు. కానీ తమ్ముడు మూవీ ఫ్లాప్ కావడంతో ఎల్లమ్మ సినిమాను నితిన్ తో కాకుండా వేరే హీరోతో చేయాలి అనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు , అందులో భాగంగా ఆయన ఓ హీరోను వెతుకుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక తెలుగులో స్టార్ నిర్మాతగా కొనసాగిన దిల్ రాజు ప్రస్తుతం మాత్రం సినిమాల విషయంలో కాస్త కష్టాల్లోనే ఉన్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: