స్టార్ హీరోల సినిమాలు రాగానే థియేటర్లలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. కానీ కొన్ని సార్లు ఆ పండుగను ఫ్యాన్స్ కోసం ఆలస్యం చేస్తారు. డైరెక్టర్, హీరో కాంబినేషన్ మీద ఉన్న అంచనాలను నిలబెట్టుకోవాలంటే తప్పనిసరిగా టైం తీసుకోవాల్సిందే. అందుకే కొన్ని సినిమాలు రెండు మూడు ఏళ్లపాటు షూటింగ్ లోనే ఉంటాయి. 2025లో అదే జరిగింది. చాలా మంది స్టార్ హీరోలు ఒక్క సినిమా కూడా విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి “విశ్వంభర” 2025లో వస్తుందని అనుకున్నారు కానీ ఆ సినిమా ఆగిపోయింది. ప్రభాస్ “రాజాసాబ్” కూడా డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది జనవరికి వెళ్లింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – ఈ ఇద్దరు హీరోలు ఈ ఏడాది ఒక్క సినిమా కూడా ఇవ్వలేకపోయారు. అంతేకాకుండా 2026లో కూడా వీరిద్దరి సినిమాలు రాకపోవచ్చని స్పష్టమవుతోంది.


మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB29 చేస్తుండగా, ఈ మూవీని 2027లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి – మహేష్ కాంబో అంటే పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ అంచనాలు పెరిగిపోతున్నాయి. రాజమౌళి ప్రతి సినిమాను బ్రాండ్‌గా మార్చిన డైరెక్టర్. అతనికి తోడు మహేష్ స్టార్ పవర్ కలిస్తే ఫలితం చిన్నదనిపించే బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇక అల్లు అర్జున్అట్లీ కాంబో కూడా అదే స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తోంది. మోషన్ క్యాప్షన్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని ఇండస్ట్రీ టాక్. అనౌన్స్‌మెంట్ టీజర్‌తోనే అట్లీ తన రేంజ్ చూపించాడు. బన్నీ కూడా ఈ సినిమా మీద నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఈ మూవీని 2027లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు.



అంటే 2026లో మహేష్, బన్నీ సినిమాలు మిస్ అయినా 2027లో మాత్రం బాక్సాఫీస్ బ్లాస్ట్ ఖాయం. ఒకవేళ ఈ రెండు సినిమాలు ఒకే సీజన్‌లో క్లాష్ అయితే మరీ ఘర్షణాత్మక ఫైట్ ఉంటుంది. కానీ వేర్వేరు సీజన్‌ల్లో రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ హంగామా లాంగ్ రన్‌లో కొనసాగుతుంది.ఫ్యాన్స్ కంటకంటిపెట్టుకుని ఎదురు చూస్తున్న ఈ రెండు ప్రాజెక్టులు ఒకసారి స్క్రీన్ మీదకి వచ్చాక తెలుగు సినిమా రేంజ్ మరో లెవెల్‌కి వెళ్లిపోతుందని చెప్పొచ్చు. 2027లో బాక్సాఫీస్ రికార్డులు రాతమారుస్తూ, మహేష్ – రాజమౌళి, బన్నీఅట్లీ కాంబినేషన్లు ఇండియన్ సినిమాను కొత్త హైట్‌కి తీసుకెళ్లే అవకాశం పక్కాగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: