
ఉత్తేజ్ చెప్పిన మాటల్లోనే ఉంది – “నా భార్యకు క్యాన్సర్ థర్డ్ స్టేజ్‌లో ఉందని తెలుసుకున్నప్పుడు వెంటనే అన్నయ్య దగ్గరికి వెళ్లాను. ఆ విషయం చెప్పగానే చిరంజీవి గారు నన్ను హత్తుకుని ‘ఓ గాడ్… ఏ ట్రీట్మెంట్ అయినా చేద్దాం, నువ్వు ధైర్యంగా ఉండు’ అని నన్ను ఓదార్చారు. కానీ అప్పటికే పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉండడంతో డాక్టర్లు ఆశలు లేవని చెప్పారు. ఒక రోజు ఉదయం పరిస్థితి మరింత దిగజారిపోయింది. నేను ఆస్పత్రికి తీసుకెళ్లాను. డాక్టర్లు ఆమె ఇక లేరని చెప్పేశారు. వెంటనే అన్నయ్యకు ఫోన్ చేసి ఏడుస్తూ పద్దు ఇక లేరు అన్నయ్యా అని చెప్పాను. అప్పుడు ఆయన షూటింగ్‌లో ఉన్నా వెంటనే ‘నీ పక్కన ఎవరు ఉన్నారు?’ అని అడిగారు. ఎవ్వరూ లేరని చెప్పగానే, ‘ఓ గాడ్… నేను వస్తున్నా’ అని వెంటనే హాస్పిటల్‌కు పరుగెత్తుకుని వచ్చేశారు. ఆ తరువాత మా ఆస్పత్రి బిల్లుతో పాటు 11 రోజుల కార్యక్రమాల ఖర్చులన్నింటినీ భరించారు” అని ఎమోషనల్‌గా చెప్పాడు ఉత్తేజ్.
ఈ సంఘటన విన్న ప్రతి ఒక్కరు మెగాస్టార్‌పై మళ్లీ గర్వపడుతున్నారు. చిరంజీవి కేవలం తెరమీద హీరోగానే కాదు, నిజజీవితంలోనూ ఒక హీరో అని మరోసారి రుజువైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉత్తేజ్ చెప్పిన ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు – “అన్నయ్య అంటే ఇదే, చిరంజీవి గారి హృదయం ఎంత పెద్దదో ఈ సంఘటన చూపిస్తుంది”, “ఇలాంటివాళ్లు అందరికీ ఆదర్శం” అంటూ మెగాస్టార్ మంచితనాన్ని కొనియాడుతున్నారు. చాలామందికి చిరంజీవి ఒక సినిమా లెజెండ్, మరికొందరికి రాజకీయ నాయకుడు, కానీ దగ్గరగా చూసిన వారికి ఆయన నిజమైన అన్నయ్య. ఉత్తేజ్ చెప్పిన ఈ కథ, చిరంజీవి ఎప్పటికీ ఎందుకు మెగాస్టార్‌గా నిలిచిపోయారో మరోసారి మనందరికీ గుర్తుచేసింది.