
దానికి బిగ్ ఎగ్జమపుల్ ఈ స్టార్ హీరో. కేవలం స్టార్ డైరెక్టర్ లతో వర్క్ చేయడం వల్ల హిట్ రావడం గ్యారెంటీ కాదని రవితేజ ప్రూవ్ చేసి చూపించేశాడు. గతంలో రవితేజ రాజమౌళి దర్శకత్వంలో ‘విక్రమార్కుడు’ సినిమాలో నటించి, మంచి హిట్ సాధించాడు. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత ఇక రవితేజ్ పేరు ఎక్కడికో వెళ్లిపోతుందని అంతా భావించారు. వెళ్లిపోయింది కూడా. కానీ ఆస్ధానం ఎక్కువుగా కాలం నిలవలేదు. అలాగే అనిల్ రావిపూడితో "రాజా ది గ్రేట్" మూవీ చేశారు. ఇది బిగ్ హిట్. ఆ తరువాత రవితేజ పోజీషన్ ఎలా మారిపోయిందో అందరికి తెలుసు.
అదే విధంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘భద్రా’ సినిమా టైంలోను జరిగింది. భద్ర వంటి క్రేజీ మూవీ కూడా ఆయన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఇప్పుడు ఈ టాలెంటెడ్ హీరో ఎందుకు హిట్లు కొట్టలేకపోతున్నాడు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఆ తప్పు డైరెక్టర్ చెప్పే కథలోనా, లేక రవితేజ తనదైన రీతిలో కథను తీసుకుని చూస్ చేసుకునే స్టోరీలోనా ..? అనేది ఫ్యాన్స్, సోషల్ మీడియాలో రకరకాల చర్చకు కారణమైంది. ఎందరో ఫ్యాన్స్ ఇంకా ఆశతో “రవితేజ హిట్ కొడితే చూడాలి” అని వెయిట్ చేస్తున్నారు, కానీ అది జరుగుతుంది అని స్పష్టంగా చెప్పలేం అంటున్నారు స్టార్స్. ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా టప్జ్. కేవలం స్టార్ డైరెక్టర్ మాత్రమే కాదు, కథ, స్క్రిప్ట్, టైమింగ్, మార్కెటింగ్ అన్ని కీలకమని ఈ సిచ్యుయేషన్ స్పష్టంగా చూపిస్తుంది.