అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితను ప్రేమించే వివాహం చేసుకున్నారు. వీరి వివాహం గత ఏడాది నవంబర్ లో జరిగింది. వివాహం అనంతరం నాగచైతన్య సినిమాలలో బిజీగా మారారు. అటు శోభిత మాత్రం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ ఈమధ్య సినిమాలలో నటిస్తోంది. ఈ మేరకు తన సినిమాకు సంబంధించి రెగ్యులర్ అప్డేట్లను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.  ఇటీవలే డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేస్తున్నట్లు ఒక ఫోటోని షేర్ చేసింది శోభిత. తాజాగా ఇలాంటి తరుణంలో ఆమె వంట చేస్తూ ఉన్న ఒక వీడియోను, ఫోటోలను కూడా షేర్ చేసింది.


ఈ ఫోటోలకు వంట చేయడం మనిషి ప్రాధమిక నైపుణ్యం అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్స్ పలు రకాల కామెంట్స్ చేయడంతో శోభిత కూడా వాటికి రిప్లై ఇస్తోంది. ఈ ఫోటోలకు నాగచైతన్య కూడా స్పందిస్తూ.. శోభిత చేసిన వంటలను రుచి చూడడానికి తాను కూడా ఎదురు చూస్తున్నానని కామెంట్ చేశారు. ఈ ఫోటోలలో శోభిత వితౌట్ మేకప్ లుక్ లో వంట చేస్తున్నట్లు కనిపిస్తోంది. వీటిని చూసిన అభిమానులు కూడా శోభితాలో ఇంత టాలెంట్ ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది నటించిన చిత్రం తండేల్. వివాహం తర్వాత తన కెరీర్ లో ఒక మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం విరూపాక్ష సినిమా డైరెక్టర్ తో ఒక మైథలాజికల్ చిత్రంలో నటిస్తూ ఉన్నారు నాగచైతన్య. శోభిత కూడా పలు హాలీవుడ్ చిత్రాలతో పాటు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తోంది. అయితే తెలుగులో మాత్రం చాలా తక్కువ చిత్రాలలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో నాగచైతన్య, శోభిత కలిసి నటించే అవకాశం ఉంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: