పవన్ యాక్ట్ చేస్తున్న ఈ డబల్ రోల్ కూడా చాలా పవర్ ఫుల్ గానే ఉంటుందని ఒక గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో ఒక పాత్ర ఉంటుందని మరొకటి చాలా ఎమోషనల్ డెప్త్ తో కూడిన పాత్ర ఉంటుందని అభిమానులు కూడా ఈ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.ఈ విషయం అటు అభిమానులను మరింత ఆసక్తి పెంచేలా చేస్తోంది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. త్వరలోనే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇందులో ఇమ్రాన్ హస్మి విలన్ గా నటిస్తున్నారు. అలాగే ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా శ్రియా రెడ్డి తదితర నటీనటులు కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.
ఓజి సినిమా ఇప్పటివరకు ఏర్పడిన హైప్ చూస్తే బాక్సాఫీస్ వద్ద ఒక సంచలన సృష్టించడం ఖాయం అంటూ అభిమానులు తెలుపుతున్నారు. రాజకీయాల వల్ల ఓజి సినిమా షూటింగ్ కొంతమేరకు ఆలస్యం అయినప్పటికీ సినిమా షూటింగ్ ని మాత్రం పూర్తి చేశారు. సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. ఓజి సినిమాకి పవన్ డబుల్ రోల్ ఏ విధంగా కలిసొస్తుందో చూడాలి మరి. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో పాల్గొని త్వరలోనే ఈ సినిమాకి కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి