పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర విరమలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం అయింది. ఈ సినిమా చాలా డిలే అవుతూ రావడంతో ఆయనకు వేరే కమిట్మెంట్స్ ఉండడంతో ఆయన ఈ సినిమా దర్శకత్వ భాద్యతల నుండి తప్పుకున్నాడు. దానితో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ ను పూర్తి చేశాడు. కొంత కాలం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది.

తాజాగా పవన్ "ఓజి" అనే సినిమాలో హీరో గా నటించాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ కి సుజిత్ దర్శకత్వ వహించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన అనేక అప్డేట్లను మేకర్స్ విడుదల చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పవన్ , హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో శ్రీ లీల , రాశి కన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2 వ తేదీన జరిగిన విషయం మనకు తెలిసిందే.

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రోజు మూవీ యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. దానికి మంచి రెస్పాన్స్ లభించింది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి కూడా ఏదైనా భారీ అప్డేట్ ఉంటుందేమో అని పవన్ అభిమానులు భావించారు. కానీ ఈ సినిమా నుండి కేవలం ఒక పోస్టర్ను మాత్రమే విడుదల చేశారు. ఇక ఓజి సినిమా విడుదలకు రెడీగా ఉండడంతో ఉస్తాది భగత్ సింగ్ మూవీ కి సంబంధించిన అప్డేట్లను హరీష్ శంకర్ విడుదల చేయడం లేదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: