ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్స్ చాలా సాధారణమైపోయాయి. కానీ కొంతమంది మాత్రం ఈ ట్రోలింగ్‌ను మరీ హద్దులు దాటి, ఓవర్‌గా చేస్తున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో టాప్ లో ఉన్న మెగా ఫ్యామిలీ విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. వారి ప్రతి చిన్న విషయంలోనూ కామెంట్స్ చేయడం, వాటిని వైరల్ చేయడం కొంతమంది “ఆకుతాయిల”కి ఒక రకంగా వినోదంగా, పైసా ఎంజాయ్‌మెంట్‌గా మారిపోయింది. ఇటీవల మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. మనందరికీ తెలిసిందే, మెగా కోడలు లావణ్య త్రిపాఠి గర్భిణి. ఆమె త్వరలోనే పండులాంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నది. ఈ సంతోషాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలని మెగా ఫ్యామిలీ మొదటి నుంచే ఓ పక్కా ప్లాన్ వేసుకుంది. ఈ క్షణం ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా ఉండాలని వారు అనుకున్నారు. అందుకే త్వరలోనే లావణ్య త్రిపాఠి శ్రీమంతం ఘనంగా జరగబోతుందని వార్తలు బయటకు వచ్చాయి.


కానీ ఈ సమయంలోనే అకస్మాత్తుగా అల్లు అరవింద్ తల్లి అల్లు కరకరత్నం గారు కన్నుమూశారు. దీంతో అల్లు కుటుంబం, మెగా కుటుంబం సభ్యులు ఒక్కచోట చేరి అన్ని కర్మకాండలను పూర్తి సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భం రెండు కుటుంబాల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరిచింది. ఇన్నాళ్లు “మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి పడదు, వారు కలవరు” అంటూ విమర్శలు చేసిన నోర్లు ఈ సంఘటనతో మూతపడ్డాయి. అయితే ఈ సైలెంట్ ముమెంట్ ఎక్కువకాలం నిలవలేదు. మళ్లీ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. లావణ్య శ్రీమంతం జరగబోతోందనే వార్త బయటపడగానే, “అల్లు అర్జున్ కుటుంబం పుట్టేడు దుఃఖంలో ఉన్నప్పుడు మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ చేస్తుందా?” అంటూ కొందరు ట్రోల్స్  చేస్తూ తల, తోకలేని లాజిక్స్ క్రియేట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూసి మెగా అభిమానులు కూడా నిశ్శబ్దంగా ఉండకుండా ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. “ఇలాంటి సందర్భాలను మీరు పోల్చడం బుద్ధిలేనితనం కాదా?” అంటూ వారు సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు.



ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఎవరో ఒకరు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటే దానిని కూడా పెద్దదిగా చేసి, కాంట్రవర్సీగా మార్చేస్తున్నారు. ఈ పరిస్థితిపై చిరంజీవి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “చిరంజీవి గారు ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోతే పరిస్థితి మరింత చేతులు జారిపోతుంది” అంటున్నారు ఫ్యాన్స్. అయితే చిరంజీవి వ్యక్తిత్వం ఎప్పటినుంచో అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడూ ఇలాంటి వివాదాలను పట్టించుకోరు. ట్రోలింగ్, విమర్శలు అన్నీ చూసి చూడనట్లు సైలెంట్‌గా వదిలేయడం ఆయనకు అలవాటు. అదే ఆయన బలమైన పర్సనాలిటీకి సంకేతం కూడా. కానీ ఈ కాలంలో సోషల్ మీడియా ట్రోలింగ్ ఒక కొత్త స్థాయికి చేరుకుంది. ఏ వార్త అయినా, ఏ సంఘటన అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇది మెగా ఫ్యామిలీ వంటి పెద్ద కుటుంబాలకు కొత్త సవాలుగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: