బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలలో నటించినది. ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించినప్పటికీ ఈమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఐశ్వర్యరాయ్. తాజాగా ఐశ్వర్యరాయ్ ఢిల్లీ హైకోర్టును సైతం ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, ఇమేజ్ లను ఎవరు ఉపయోగించకుండా తక్షణమే ఆదేశాలను జారీ చేయాలి అంటూ ఆమె హైకోర్టుని ఆశ్రయించింది.



ఈ విషయం పైన హైకోర్టు కూడా విచారణ జరిపి తాత్కాలిక ఉత్తర్వులను కూడా జారీ చేసినట్లు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఐశ్వర్యరాయ్ తరపున న్యాయవాది సందీప్ సేథీ కోర్టుకు అందించిన వివరాల ప్రకారం.. కొంతమంది వ్యక్తులు, సంస్థలు ,ఈమె ఫోటోలను మార్పింగ్ చేసి మరి(AI)తో ఎడిటింగ్ చేసి అసభ్యకరమైన వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని.. వీటికి తోడు ఆమె ఫోటోలలో క్రియేట్ చేసిన టీ షర్టుల పైన తమ వ్యాపారానికి సంబంధించిన వాటిని ముద్రించుకుంటున్నారు అంటూ తెలిపారు.

ఐశ్వర్యరాయ్ అనుమతి లేకుండా ఎవరు ఇలా చేయకూడదని.. ఇది ప్రైవసీ హక్కులకు ఉల్లంఘనే అంటూ ఐశ్వర్యరాయ్ తరపున న్యాయవాది వాదించారు. ఇందుకు సంబంధించి ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ విచారణను కోర్టు 2026 జనవరి 15కి వాయిదా వేశారు.. గతంలో కూడా ఐశ్వర్య రాయ్, కుమార్తె ఆరాధ్య, భర్త అభిషేక్ బచ్చన్ పైన తప్పుడు ప్రచారాలు చేయడంతో కోర్టును ఆశ్రయించింది. కొంతమంది యూట్యూబ్ లలో నకిలీ వార్తలు రాయడం వల్ల ప్రైవసీ విషయాలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంటుందని కోర్టు కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కి వార్నింగ్ ఇచ్చి ఆ కంటెంట్ ని తొలగించమంటూ ఆదేశాలను జారీ చేసింది. ఇప్పుడు మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: