టాలీవుడ్ నటుడు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే చాలా సినిమాలలో హీరో గా నటించాడు. ఈయన ఇప్పటివరకు అనేక సినిమాలలో హీరో గా నటించిన ఈయనకు విజయాలు మాత్రం చాలా తక్కువ గానే దక్కాయి. ఆఖరుగా అఖిల్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఆపజయాన్ని సొంతం చేసుకుంది. ఏజెంట్ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న అఖిల్ కొంత కాలం క్రితమే లెనిన్ అనే సినిమాను మొదలు పెట్టాడు.

మూవీ లో శ్రీ లీల ను హీరోయిన్గా మొదట ఎంచుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు ఈ ముద్దు గుమ్మ ఈ సినిమా నుండి తప్పుకుంది. దానితో ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ ను హీరోయిన్గా ఎంచుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే అఖిల్ కొంత కాలం క్రితమే జైనాబ్ రావ్జి అనే అమ్మాయిని  పెళ్లి చేసుకున్న విషయం మన అందరికి తెలిసిందే. ప్రస్తుతం వీరి సంసార జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. 

ఇకపోతే తాజాగా సెప్టెంబర్ 9 వ తేదీతో  అఖిల్ సతీ సతీమణి అయినటువంటి జైనాబ్ రావ్జి 40 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. దానితో అఖిల్ తన భార్య అయినటువంటి జైనాబ్ రావ్జి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాడు. ఈ పుట్టిన రోజు వేడుకలు ఒక హోటల్ లో జరిగినట్లు తెలుస్తోంది. దీనికి అఖిల్ మరియు జైనాబ్ రావ్జి తరపు బంధువులు మాత్రమే అటెండ్ అయినట్లు తెలుస్తోంది. ఇక అఖిల్ తన భార్య బర్త్ డే సందర్భంగా తన సోషల్ మీడియా అకౌంట్లో తనతో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేశాడు. అది ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: