సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు, ఇంటిమేట్ సీన్లు ఎన్ని ఉంటాయో చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పటి జనరేషన్ యూత్ ఇలాంటి ఇంటిమేట్ సన్నివేశాలు ఉంటేనే సినిమాలు చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.. అందుకే ఇప్పటి యూత్ ఆలోచనల కి తగ్గట్టుగా ఉండే సినిమాలనే దర్శకులు కూడా చూజ్ చేసుకుంటున్నారు.యూత్ మెచ్చే ముద్దు సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు ఉండేలా తమ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.అంతే కాదు ఇలాంటి సన్నివేశాలు లేకపోతే ప్రేక్షకుల్లో కూడా బోర్ కొడుతోంది. అందుకే దర్శకులు ప్రేక్షకుల అభిప్రాయాన్ని ముందుగానే గ్రహించి ఇలాంటి సన్నివేశాలను సినిమాల్లో పెడుతున్నారు. 

అయితే ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ముద్దు సన్నివేశాలు ఇప్పటి జనరేషన్ లోనే కాదు సినీ ఇండస్ట్రీ మొదలైనప్పటినుండే ఉన్నాయి.అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరో మాత్రం హీరోయిన్లతో ముద్దు సన్నివేశం చేయాలంటే ఓ పెగ్గు మందు పడాల్సిందేనట. మరి ఇంతకీ మందు తాగకుండా హీరోయిన్స్ తో ముద్దు సన్నివేశం చేయని ఆ హీరో ఎవరయ్యా అంటే బాలీవుడ్ అగ్ర నటుడు జాకీ ష్రాఫ్.. బాలీవుడ్ లో అగ్ర నటుడిగా పేరు తెచ్చుకున్న జాకీ ష్రాఫ్  తన సినిమా విశేషాలను రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ.. నేను ఎన్నో హిట్ సినిమాల్లో నటించాను. అయితే హీరోయిన్ తో ముద్దు సన్నివేశాలు అనేసరికి చాలా భయం వేసేది. యాక్షన్ సీన్స్ ని ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా నటించే నేను ముద్దు సన్నివేశాలు రొమాంటిక్ సన్నివేశాలు వచ్చేసరికి మాత్రం చాలా టెన్షన్ మొదలయ్యేది.

ఇక నా టెన్షన్ చూసిన దర్శకులు కూడా అలా టెన్షన్ ఫీల్ అవ్వకండి మీరు టెన్షన్ పడితే సీన్ సరిగ్గా రాదు ఎక్కువ టేక్స్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేవారు.అయితే టెన్షన్ పోవాలి అంటే మందు కొట్టాలి అని అప్పుడే ఫిక్స్ అయ్యాను.అందుకే హీరోయిన్లతో రొమాంటిక్ సీన్లు కిస్సింగ్ సీన్స్ చేసే సమయంలో ఓ పెగ్గు బ్రాందీ తాగేవాడిని. అలా బ్రాందీ తాగి కెమెరా ముందు నిల్చొని ఉంటే నా టెన్షన్ మొత్తం పోయేది. ఇక టెన్షన్ పోయాక హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాలు ముద్దు సన్నివేశాలు చేసేవాడిని. అలా 1989 లో విడుదలైన వర్ధి సినిమాలో మాధురి దీక్షిత్ తో ముద్దు సన్నివేశం కోసం ఓ పెగ్గు మందు తాగే సీన్ చేశాను.అలాగే జూహీ చావ్లా తో  రొమాంటిక్ సన్నివేశాలు చేసినప్పుడు కూడా బ్రాందీ తాగి ఆ సన్నివేశాల్లో నటించేవాడిని అంటూ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టారు నటుడు జాకీ ష్రాఫ్

మరింత సమాచారం తెలుసుకోండి: