గత కొంత కాలంగా తెలుగు బాక్సా ఫీస్ కాస్త తడబడుతుంది. భారీ అంచనా నడుమ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు సినిమా విడుదల అయింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేక పోయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన కింగ్డమ్ సినిమా కూడా మంచి అంచనాల నడుమ విడుదల అయింది.

సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. ఇక ఆ తర్వాత విడుదల అయిన డబ్బింగ్ సినిమాలు అయినటువంటి వార్ 2 , కూలీ సినిమాలు కూడా భారీ కలెక్షన్లను వసూలు చేసి బాక్సా ఫీస్ దగ్గర పెద్ద స్థాయి సందడిని నెలకొల్పుతాయి అని చాలా మంది అంచనా వేశారు. కానీ ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చతికలబడ్డాయి. ఇక సెప్టెంబర్ నెల మాత్రం బాక్సా ఫీస్ కు మంచి రోజులను తీసుకు వచ్చింది అనేలా కనబడుతుంది. అసలు విషయం లోకి వెళితే ... సెప్టెంబర్ నెల మొదటి వారంలో లిటిల్ హార్ట్స్ అనే తక్కువ బడ్జెట్ సినిమా విడుదల అయింది. కానీ ఈ సినిమా మంచి టాక్ ను తెచ్చుకొని భారీ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తుంది.

ఇకపోతే తాజాగా సెప్టెంబర్ 12 వ తేదీన మీరాయ్ మరియు కిష్కిందపురి సినిమాలు విడుదల కానున్నాయి. ఈ రెండు మూవీలకు సంబంధించి ఇప్పటికే అద్భుతమైన పాజిటివ్ టాక్ వస్తుంది. దానితో ఈ రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టే అవకాశాలు కనబడుతున్నాయి. దానితో గత కొంత కాలంగా తెలుగు బాక్సా ఫీస్ స్లో అయినా కూడా సెప్టెంబర్ నెలలో మళ్లీ తిరిగి పుంచుకోబోతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: